ఈ మధ్య కాలంలో సినిమా నటుల ఆరోగ్యంపై ఫ్యాన్స్ లో అనేక భయాలు ఉన్నాయి. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వతా జనాల్లో భయం మరింత పెరిగింది. ఎప్పుడు ఏ రూపంలో చావు ముంచుకు వస్తుందో అనే భయం మొదలయింది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునే తమ అభిమాన నటుల ఆరోగ్యం కలవరపెడుతోంది. జిమ్ లు వారి ప్రాణాలను హరిస్తున్నాయనే ఆందోళన కూడా ఫ్యాన్స్ లో ఉంది. ప్రేక్షకులను అలరించడానికి వారు పడే కష్టమే వారి ప్రాణాలను తీస్తోంది.
తాజాగా వచ్చిన ఓ వార్త కన్నడ, తెలుగు సినిమాలో సంచలనం అవుతోంది. ఓ స్టార్ హీరోకు క్యాన్సర్ అనే ప్రచారం పీక్స్ లో జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయం బయటపెట్టాడు. తాను తాను చికిత్స పొందుతున్నానని, ఇప్పుడు కోలుకుంటున్నట్లు చెప్పిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ను భయపెట్టింది. నేను కూడా మనిషినే, నాకు ఆరోగ్య సమస్య ఉందని… అది వచ్చేసింది, దానికి చికిత్స తీసుకుంటున్నాను. నాకు పూర్తిగా వ్యాధి నయం కావడానికి నాలుగు సెషన్ల చికిత్స ఉందని తెలిపాడు.
వైద్యం కొనసాగుతున్నా రాబోయే చిత్రం షూటింగ్, ప్రమోషన్స్ కు హాజరు కావడం తనకు ఇబ్బంది లేదని, తన బాధ్యత నెరవేరుస్తున్నా అంటూ ప్రకటించాడు. మరో రెండు సెషన్ల తర్వాత యుఎస్‌లో వైద్యం చేయించుకుంటా అని ప్రకటించాడు. నెల నుంచి రెండు నెలల పాటు కోలుకోవడానికి సమయం పట్టే ఛాన్స్ ఉందని అన్నాడు. తనతో వర్క్ చేస్తున్న నిర్మాతలు, దర్శకులకు తన పరిస్థితి తెలుసునని ప్రకటించాడు. దీనిపై ఎన్నో అపార్ధాలు ఉన్నాయని వాటి గురించి క్లారిటీ ఇవ్వడానికి పబ్లిక్ గా ఈ విషయం చెప్పాలనుకున్నట్టు తెలిపాడు.
దాని గురించి మొదట తెలుసుకున్నప్పుడు ముందు భయపడ్డాను అని, కాని ఆందోళన లేదని… ఆ తర్వాత ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇప్పుడు, అది మెరుగుపడుతోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక తన ఆరోగ్యం దృష్ట్యా తనతో సెల్ఫీలు తీసుకునేటప్పుడు దూరం పాటించాలని ఇటీవల అభిమానులను కోరినట్లు చెప్పాడు. రెండు నెలల్లో అంతా సాధారణ స్థితికి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన విధానం చూసి కచ్చితంగా అది క్యాన్సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. శివ రాజ్ కుమార్ గతంలో కూడా గుండెపోటుకు గురయ్యారు. 2015 లో పని ఒత్తిడి కారణంగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కాగా నందమూరి ఫ్యామిలీకి రాజ్ కుమార్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. శివ రాజ్ కుమార్ ఈ విషయం చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ లో భయం మొదలయింది.