Rajinikanth: సూపర్ స్టార్ క్రేజ్.. రజినీ కోసం యంగ్ హీరో

రజినీకాంత్ తన 171వ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. తలైవర్ 171 వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన మూవీలో.. రజినీ కాంత్‌ను నెగెటివ్ షేడ్స్‌లో చూపిచంబోతున్నాడు లోకేష్. దీంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 04:55 PM IST

Rajinikanth: జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్. ప్రస్తుతం రజినీ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న ‘లాల్ సలామ్’ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే.. జైలర్ మూవీ విడుదల కాకముందే 170వ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. జై భీమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన దర్శకుడు జ్ఞానవేల్‌ రాజాతో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

RAM CHARAN: ఓటు వేసేందుకు రామ్ చరణ్ చేసిన పనికి ఫిదా..!

ఇక ఈ సినిమా తర్వాత రజినీకాంత్ తన 171వ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడు. తలైవర్ 171 వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన మూవీలో.. రజినీ కాంత్‌ను నెగెటివ్ షేడ్స్‌లో చూపిచంబోతున్నాడు లోకేష్. దీంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాకు ‘కోడ్ రెడ్’ అనే టైటిల్ వినిపిస్తోంది. లోకేష్‌ యూనివర్స్ కాకుండా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్‌గా తలైవర్ 171 తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల ప్రకారం.. మూవీలో మరో యంగ్ హీరో ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. రజినీకాంత్ కోసం శివ కార్తికేయన్‌ని రంగంలోకి దించాడట లోకేష్ కనగరాజ్. ఇప్పటికే శివ కార్తికేయన్‌తో చర్చలు కూడా కంప్లీట్ అయ్యాయట.

కుర్ర హీరో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో తలైవర్ 171 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. యంగ్ హీరో ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.