మళ్ళీ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్…? దేవర కోసం ప్రశాంత్ నీల్ కథ ఇదే…?

ఇండియన్ సినిమాలో స్మగ్లింగ్ కు డిమాండ్ ఎక్కువ. ప్రేమ కథా సినిమాలు, ఫ్యామిలీ సినిమాల కంటే మాస్ ఆడియన్స్ ఒకప్పుడు అండర్ వరల్డ్ సినిమాలను బాగా ఇష్టపడేవారు. అందుకే రామ్ గోపాల్ వర్మ సహా ఎందరో డైరెక్టర్లు స్మగ్లింగ్ ను బేస్ చేసుకుని సినిమాలు చేసి హిట్ లు కొట్టారు.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 12:05 PM IST

ఇండియన్ సినిమాలో స్మగ్లింగ్ కు డిమాండ్ ఎక్కువ. ప్రేమ కథా సినిమాలు, ఫ్యామిలీ సినిమాల కంటే మాస్ ఆడియన్స్ ఒకప్పుడు అండర్ వరల్డ్ సినిమాలను బాగా ఇష్టపడేవారు. అందుకే రామ్ గోపాల్ వర్మ సహా ఎందరో డైరెక్టర్లు స్మగ్లింగ్ ను బేస్ చేసుకుని సినిమాలు చేసి హిట్ లు కొట్టారు. మన తెలుగు సినిమాలో మాత్రం ఇది కాస్త తక్కువ. ఎప్పుడో ఒక సినిమా వచ్చేది. బాలీవుడ్ లో మాత్రం ఈ జోనర్ కు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. అందుకే దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ వంటి వారిని ఎక్కువగా బేస్ చేసుకుంటారు.

వాళ్ళను హీరోలుగా చూసే ఆడియన్స్ కూడా కొందరు ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్ కు యూత్ లో అందుకే ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు మన సౌత్ సినిమా కూడా అదే బాటలో వెళ్తోంది. స్మగ్లింగ్ ను బేస్ చేసుకుని చేసే సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పుష్ప సీరీస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. వచ్చే నెల 5 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. కేజిఎఫ్ సీరీస్ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ ను సినిమా బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు.

ఇక సలార్ సినిమా కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత సలార్ 2 కూడా రానుంది. కేజిఎఫ్ 3 సినిమా కూడా ఇదే బ్యాక్ గ్రాప్ లో ఉంటుంది. పుష్ప 3 ఉన్నా సరే అదే బ్యాక్ డ్రాప్ లో రావడం పక్కా. ఇక ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర సినిమా కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. బంగ్లాదేశ్ బేస్ గా ఓ తెలుగు వాడు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు.

అక్కడే తన ప్రజలను కాపాడుకోవడానికి ఓ యుద్ధం చేస్తాడు. శ్రీకాకుళం నుంచి వలస వెళ్ళిన ప్రజలకు సపోర్ట్ గా ఉంటాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 షూట్ లో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కూడా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ అనే న్యూస్ తో టాలీవుడ్ షేక్ అవుతోంది. అదే హిట్ ఫార్ములా కావడంతో ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడతాడో ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ అంచనాలు వేయడం స్టార్ట్ చేసారు.