Sonu Sood: 2500 కిలోల బియ్యంతో బొమ్మ లవ్‌ యూ సోనూసూద్‌..

సోనూసూద్.. విలన్ కాదు హీరో. కరోనా సమయంలో వేల మందిని ఆదుకొని.. లక్షల మందికి ఆదర్శనంగా నిలిచి కోట్ల మందిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి. సాటి మనిషి కష్టం మనది అనుకుంటే.. ఆ కష్టాన్ని పంచుకుంటే.. మనిషే దేవుడవుతాడు.. దేవుడినే మనిషి అనుకుంటారు అని ప్రూవ్ చేశాడు సోనూసూద్‌. చాలామంది ఆకలి తీర్చాడు.. అన్నా కష్టం అంటే వెంటనే ప్రత్యక్షం అయ్యాడు. చదువు చెప్పించాడు.. చదువుకు ఖర్చు చేశాడు.. ట్రాక్టర్లు ఇచ్చాడు. అందుకే రియల్ హీరో అయ్యాడు.

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 02:30 PM IST

సోనూసూద్ అంటే.. ఇప్పుడు ఒక పేరు మాత్రమే కాదు.. ఎమోషన్‌లా మారింది సీన్ ! ఇప్పటికీ పలువురు వినూత్న రీతిలో ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్‌లో సోనూసూద్‌ అభిమానులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. 25వందల కిలోల బియ్యంతో ఆయన బొమ్మను తీర్చిదిద్దారు. ప్లాస్టిక్‌ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూసూద్‌ చిత్రాన్ని రూపొందించారు. తుకోజీరావు పవార్‌ స్టేడియంలో ఎకరం స్థలంలో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.

ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఓ అనాథాశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. సినిమాల్లో విలన్‌గా అద్భుతమైన నటనతో ఆకట్టుకునే సోనూసూద్‌ కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేశారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. ఓ స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నారు.