Tamannaah Love Marriage : త్వరలోనే తమన్నా ప్రేమ పెళ్లి..

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాతో దూసుకుపోతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాల కంటే ఎక్కువగా ప్రేమ వ్యవహారంలో హాట్ టాపిక్ అవుతోంది తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది తమ్మూ. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తోంది ఈ జంట.

గతేడాది విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించి రెచ్చిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు హాట్ టాపిక్ అవుతునే ఉన్నారు. కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం సమాధానం దాటేస్తున్నారు. ఈ ఇద్దరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లి పీఠలెక్కడం ఖాయమంటున్నారు. నిన్నటి మొన్నటి వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న తమన్నా.. ఉన్నట్టుండి ఇప్పుడు వరుసగా దేవాలయాలను సందర్శిస్తుంది.

ఇటీవల కుటుంబ సభ్యులతో పాటు గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించింది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీంతో తమన్నా మళ్లీ పెళ్లిపై మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ బోల్డ్ బ్యూటీ పెళ్లి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే తమన్నా, విజయ్ వర్మ పెళ్లి కబురు రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి తమన్నా ఎప్పుడు పెళ్లి న్యూస్ ఎప్పుడు చెబుతుందో చూడాలి.