ఇంతకాలం అల్లు అర్జున్ సైన్యం.. జనసేన మధ్యే వార్ నడుస్తుందనుకుంటే… మెగా హీరోలు కూడా చేరారు. అలాగని.. మెగా ఫ్యామిలీ హీరోలు బన్నీని విమర్శించలేదు.. కామెంట్స్ చేయలేదు. అసలు ఏమీ మాట్లాడకపోవడంతోనే సైలెన్స్ వల్లే దూరం పెరిగింది. అల్లు మెగా విభేదాలు మరోసారి బ్లాస్ట్ అండ్ బ్రేక్ అయ్యాయి. పుష్ప2 ట్రైలర్ తెచ్చిన రగడ చివరికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది.
ఎ.పి ఎన్నికల ముందు నుంచి.. సైనిక్స్.. సేన మధ్య పచ్చగడ్డేస్తే భగ్గు మంటోంది. అటు.. పవన్‌గానీ.. ఇటు అల్లు అర్జున్‌గానీ.. ఖండించలేదు.. తగ్గేదే లేదంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా ఎటాక్స్ ఇచ్చుకున్నారు. ఇది కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారి మెగా హీరోలకు చుట్టుకుంది.
పుష్ప2 ట్రైలర్ రిలీజ్ తర్వాత రాజమౌళి స్పందిస్తూ… పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలుకాగా.. అది దేశమంతటా విస్తరిస్తోందని కామెంట్ చేశాడు. పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్నాం పుష్పా అని ట్వీట్ చేశాడు. రిషబ్ శెట్టి.. హరీశ్ శంకర్.. అనిల్ రావిపూడి వంటి దర్శకులు.. పుష్ప2ను మెచ్చుకున్నారు. యంగ్ హీరోలు సైతం పుష్ప2పై ప్రశంసలు కురిపించారు. అయితే మెగా హీరోల నుంచి ఒక్క ట్వీట్ లేదు. పుష్ప2 గురించి మాట్లాడకూడదన్నట్టు.. అందరూ సిండికేట్ అయ్యారా? అనిపిస్తోంది. అందరికంటే ముందుగా స్పందించే చిరంజీవి మౌనంగా వుండడం షాక్ ఇస్తోంది. పుష్ప2 ట్రైలర్ బాగుందనకపోయినా.. ఆల్‌ది బెస్ట్ అని కూడా చెప్పకపోవడంతో మెగా, అల్లు కాంపౌండ్ మధ్య దూరం మరోసారి బైటపడింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ నడుస్తున్నా..యు ట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది.
తెలుగు ట్రైలర్ 43 మిలియన్ వ్యూవ్స్‌తో సౌత్‌లోని టాప్ ప్లేస్‌లో నిలిచింది. తెలుగు ట్రైలర్ కంటే హిందీ ట్రైలర్ ఎక్కువ వ్యూవ్స్ 50 మిలియన్స్ రావడం విశేషం. ఇదే విషయం మెగా హీరో సన్నిహితులను ప్రశ్నిస్తే చిరంజీవి విశ్వంభర, వరుణ్ తేజ్ మట్కా, చెర్రీ గేమ్ ఛేంజర్ ట్రైలర్స్ వచ్చినప్పుడు బన్నీ రియాక్ట్ అయ్యాడా? అతనికి లేని బంధుత్వం మెగా ఫ్యామిలీ కి ఎందుకు ఉండాలి? అందుకే పుష్ప ట్రైలర్ పై మెగా కాంపౌండ్ రియాక్ట్ అవ్వలేదు అనే సమాధానం వచ్చింది