Sreeleela: శ్రీలీల కెరీర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా.. కెరీర్ బిగినింగ్‌లోనే డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. కృతి శెట్టి మాదిరే శ్రీలీలది కూడా ఆరంభ శూరత్వమేనా..? ఇవన్నీ ఎందుకంటే.. సడెన్‌గా ఈ బ్యూటీ కెరీర్‌పై కొత్త అనుమానాలు రెయిజ్ అవుతున్నాయ్. శ్రీలీల.. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. తర్వాత చేసిన ధమాకా బ్లాక్ బస్టర్ అయింది. వంద కోట్లు వసూళ్లు చేసింది. దాంతో ఒక్కసారిగా శ్రీలీల కటౌట్ హైలైట్ అయింది.
DIRECTORS: మీరు మారిపోయారు సార్.. కొత్త దారిలో టాలీవుడ్ డైరెక్టర్స్..
ఒకేసారి 10సినిమాలకు సైన్ చేసే ఛాన్స్ తెచ్చిపెట్టింది. కానీ తర్వాతే సీన్ రివర్స్ అయింది. రీసెంట్గా వచ్చిన స్కంద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వైష్ణవ్ తేజ్‌తో చేసిన ఆదికేశవ ఆడ్రస్ లేకుండా పోయింది. బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి పర్వాలేదనిపించినా.. తాజాగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఈ బ్యూటీకి ఏ విధంగా కలిసిరాలేదు. పర్ఫామెన్స్పరంగా నితిన్ వెరియేషన్ చూపించాడు. కానీ శ్రీలీల క్యారెక్టర్ తేలిపోయింది. డ్యాన్స్ విషయంలో కూడా తనని పెద్దగా వాడుకోలేదు డైరెక్టర్. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా.. గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఇందులో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే మంచి గుర్తింపు దక్కుతుంది. లేదంటే మరో కృతిశెట్టి తరహాలోనే ఒక్కసారిగా డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. చేతిలో ఉస్తాద్, అనగనగా ఒకరాజు, VD12 సినిమాలు ఉన్నా.. శ్రీలీల కెరీర్‌కి మహేష్ మూవీ కీలకం. మరి ఈ సినిమాతో ఈ బ్యూటీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.