Sreeleela: ఓవర్‌నైట్ స్టార్‌కు ఎగ్జాంపుల్ అంటే శ్రీలీలను చూపించొచ్చు. ఒక్క మూవీతో టాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగింది. సీనియర్లందరినీ పక్కకు నెట్టేసి మరీ.. స్టార్ హీరోయిన్ అవతారం ఎత్తింది. ధమాకా హిట్ తర్వాత.. ఏకంగా పది సినిమాల్లో ఆఫర్ కొట్టేసింది. ఐతే ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఎంత ఫాస్ట్‌గా స్టార్‌గా మారిందో.. అంతే దారుణంగా ఫ్లాప్‌లు పలకరిస్తున్నాయ్. భగవంత్ కేసరి సంగతి వదిలేస్తే.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్‌గానే మిగిలిపోయాయ్.
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి రండి.. రాంచరణ్‌కు ఆహ్వానం..
రెండో మూవీ స్కందతో మొదలైన ఫ్లాప్‌ల లైన్.. ఇప్పుడు గుంటూరు కారం వరకు వచ్చింది. ఐతే ఇప్పుడు శ్రీలీల.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. శ్రీలీల సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో.. పవన్ మూవీ పరిస్తితి ఏంటా అని వాళ్లంతా తెగ టెన్షన్ పడుతున్నారు. పవన్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్‌లో శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇప్పటివరకు లుక్ బయటకు రాకపోయినా.. శ్రీలీలే లీడ్ రోల్. ఐతే లీల సెంటిమెంట్ పవర్ ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. శ్రీలీల అంటే.. డ్యాన్స్ అనే మాట మాత్రమే వినిపిస్తోంది. స్ర్కీన్ మీద కనిపించి.. కాసేపు స్టెప్పులేసి.. హీరోతో లవ్ పేరుతో రొమాన్స్ చేసే పాత్రలే తప్ప కొత్తగా ఏం ఎంచుకోవా శ్రీలీల అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పెద్ద హీరోల పక్కన సపోర్టింగ్ యాక్టర్‌కు ఉన్నంత స్పేస్ కూడా లేకుండా పోతుంది కదా.. ఇప్పటికైనా స్టోరీ సెలక్షన్ విషయంలో మారు అంటూ గట్టిగానే చెప్తున్నారు ఫ్యాన్స్. నిజానికి శ్రీలీల అంటే వెంటనే స్ట్రైక్ అయ్యేది డ్యాన్స్ మాత్రమే.
యాక్టింగ్ విషయంలో బ్యూటీకి ఇప్పటివరకు సరైన మార్కులు పడలేదు. భగవంత్ కేసరిలో పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్నా.. బాలయ్య సునామీ ముందు లీలకు పెద్దగా పేరు రాలేదు. ఐతే మాటలతో మాత్రమే సినిమాను నడిపించడం ఎంత కష్టమో.. డ్యాన్సుతోనే కెరీర్ కొనసాగించడం కూడా అంతే కష్టం. గొప్పగా చెప్పుకునే పాత్రలు చేయాలని.. అప్పుడే స్టార్ హీరోయిన్ల సరసన చోటు దక్కుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. సినిమాల ఎంపిక విషయంలో శ్రీలీల ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు.