Sreeleela: నాలుగు కోట్లు ఇచ్చినా ఐటెం సాంగ్‌కి నో అంటున్న శ్రీలీల

స్పెషల్ సాంగ్స్ విషయంలో తన రూటే సెపరెట్ అంటోంది శ్రీలీల. ఎంత ఆఫర్ చేసిన ఐటెం సాంగ్స్‌కి నో ఛాన్స్ అంటూ కొట్టిపడేస్తోంది. గతేడాది ధమాకా సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకున్న శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ 10 సినిమాలకు సైన్ చేసింది.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 04:11 PM IST

Sreeleela: కథ ఏదైనా.. హీరో ఎవరైనా.. సినిమా జనాల్లోకి వెళ్ళాలి అంటే ఐటెం సాంగ్ కచ్చితంగా ఉండాలి. మాస్ కథకి మసాలా సాంగ్ యాడ్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే. దీని కోసం కొన్నిసార్లు స్టార్ హీరోయిన్స్ బరిలో దిగుతారు. అయితే స్పెషల్ సాంగ్స్ విషయంలో తన రూటే సెపరెట్ అంటోంది శ్రీలీల. ఎంత ఆఫర్ చేసిన ఐటెం సాంగ్స్‌కి నో ఛాన్స్ అంటూ కొట్టిపడేస్తోంది. గతేడాది ధమాకా సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకున్న శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ 10 సినిమాలకు సైన్ చేసింది.

ఒకవైపు షూటింగ్స్‌లో పాల్గొంటూనే నెలకో సినిమాని రిలీజ్ చేస్తోంది. రీసెంట్‌గా స్కంద మూవీతో డిజాస్టర్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు భగవంత్ కేసరితో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. దానికి తగ్గటే ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న శ్రీలీల తను ఐటెం సాంగ్ చేస్తున్నట్లు వస్తున్న రుమార్స్‌కి క్లారిటీ ఇచ్చింది. శ్రీలీల.. పవన్ నటిస్తున్న ఓజిలో ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే బన్నీ పుష్ప2లో కూడా ఈ లేడీ.. స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఈ ప్రచారం నిజం కథని తేల్చిచెప్పింది శ్రీలీల. తను ఐటమ్ సాంగ్స్ చేసే అవకాశాలు ఇప్పట్లో లేవని స్పష్టం చేసింది. కొంతకాలం పాటు సెంటిమెంట్, ఎమోషన్ ఉన్న మంచి పాత్రలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. కథ డిమాండ్ చేస్తే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా తను రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో శ్రీలీల ఐటెం సాంగ్స్ మ్యాటర్‌కి ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.