Peda Kapu: ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఓ డైరెక్టర్ వున్నట్టుండి కత్తి పట్టాడు. ఒకే ఫ్రేమ్‌లో నాలుగైదు ఫ్యామిలీ మెంబర్స్ కనిపించేలా సినిమా తీసే ఆ దర్శకుడు మారిపోయి మెడకాయ్ మీద తలకాయ్ వుండకూడదంటున్నాడు. ఫ్యామిలీ డైరెక్టర్‌లో ఇంత మార్పు ఎందుకొచ్చింది. పెద్దకాపుతో శ్రీకాంత్ అడ్డాల యాక్టర్‌గా మారాడు. ట్రైలర్‌లో విలన్‌గా కనిపించాడు. ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా తీశాడంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే.. కొత్త బంగారు లోకం అనే అందమైన ప్రేమకథతో శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా పరిచయమయ్యాడు.
ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఫ్యామిలీ అడియన్స్‌కు బాగా నచ్చేశాడు. ఇదే దారిలో వెళ్లి తీసిన బ్రహ్మోత్సవం నిరాశపరిచింది. మధ్యలో తీసిన ముకుంద కూడా ఫ్యామిలీ మూవీనే. బ్రహ్మోత్సవం దెబ్బకు శ్రీకాంత్ అడ్డాల ఐదేళ్లు కనిపించలేరు. రీమేక్ మూవీ నారప్పతో ముందుకొచ్చినా.. అది ఓటీటీకే పరిమితమైంది. ఇప్పుడు ఫ్యామిలీ డైరెక్టర్ కాస్తా యాక్షన్ డైరెక్టర్ అయిపోయాడంటూ అందరూ షాక్ అయ్యారు. మెగాపోన్ బదులు కత్తి పట్టాడేంటంటూ కామెంట్స్ చేశారు. నారప్ప నిరాశపరిచినా.. కత్తి వదిలిపెట్టలేదు. విరాట్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’ మూవీ తీస్తున్నాడు. ఓ సామాజిక వర్గాన్ని టైటిల్లో పెట్టుకుని ఆసక్తి రేపాడు. టీజర్‌ను ఎన్టీఆర్ మాటలతో స్టార్ట్ చేసి షాక్ ఇచ్చాడు దర్శకుడు.
ఇక ట్రైలర్‌లో కులాల ప్రస్తావనతో నింపేశాడు. కులాన్ని టైటిల్‌గా పెట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల మున్ముందు కాంట్రవర్సీలకు తెరలేపే అవకాశం లేకపోలేదు. ఈ సినిమాతో విరాట్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ కాగా.. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే, పొలిటికల్, సోషల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందినట్లు అర్థమవుతోంది. దీంతో పెద్ద కాపు ఎవరిని టార్గెట్ చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు పెద్ద చర్చ.