ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడింది. రీసెంట్‌గా కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) చనిపోయారంటూ కొందరు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. కోటా మాత్రమే కాదు. గతంలో చాలా మంది సెలబ్రెటీల విషయంలో ఇదే జరిగింది. వాళ్లు బతికుండగానే చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కొందరు మూర్ఖులు. చివరికి వాళ్లే మీడియా ముందుకు వచ్చి.. తాము బతికే ఉన్నమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే తాను కూడా గతంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పాడు హీరో శ్రీకాంత్ (Srikanth). అప్పట్లో శ్రీకాంత్ తన భార్యతో విడిపోతున్నాడంటూ కొందరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఆ విషయంలో మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యాడట శ్రీకాంత్. మీడియా ముందు నిజానిజాలు బయటపెట్టి ఫ్యామిలీతో కొన్ని రోజులు టూర్‌కు వెళ్లి వచ్చాడట. రీసెంట్‌గా తాను చనిపోయినట్టు ఇంటర్నెట్‌లో ఓ పోస్ట్ చూశాడట శ్రీకాంత్. కానీ ఆ న్యూస్ పెద్దగా స్పెడ్ కాకపోవడంతో ఇష్యూ అక్కడితో ఆగిపోయిందట. లేదంటే మరోసారి తాను మీడియా ముందుకు వచ్చి బతికే ఉన్నానని ప్రూవ్ చేసుకోవాల్సివచ్చేదన్నాడు. ఇలా చాలా మంది తమకు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నెయిల్స్ పెట్టి ఫేక్ న్యూస్ ప్రెడ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు శ్రీకాంత్. ఇలాంటివి చూసినప్పుడు మానసిక వేదనకు గురవుతున్నట్టు చెప్పాడు.