Srileela  : శ్రీలీల MBBS చదువుకోండి ఫస్టు

టాలీవుడ్ లో ఇప్పుడు ప్రతి రెండు సినిమాలలో గనక చూస్తే, ఒక సినిమాలో శ్రీలీలే హీరోయిన్ గా హవా చాటుతోంది. పెద్ద హీరోల నుంచి, అప్ కమింగ్ హీరోల వరకు, శ్రీ లీలే మొదటి ఛాయిస్ గా మేకర్స్ ముందు నిలుస్తోంది.

టాలీవుడ్ లో ఇప్పుడు ప్రతి రెండు సినిమాలలో గనక చూస్తే, ఒక సినిమాలో శ్రీలీలే హీరోయిన్ గా హవా చాటుతోంది. పెద్ద హీరోల నుంచి, అప్ కమింగ్ హీరోల వరకు, శ్రీ లీలే మొదటి ఛాయిస్ గా మేకర్స్ ముందు నిలుస్తోంది. అయితే, తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఒకవైపు యాక్టర్ గానే కాకుండా, మరోవైపు డాక్టరుగా అవ్వాలన్న వైపు కూడా అడుగులు కదుపుతోంది. ఇప్పుడు శ్రీలీల MBBS ఫైనల్ ఇయర్ లో ఉంది. ముంబైలో చదువుతున్న శ్రీలీల, తన ఫైలాన్ ఇయర్ పరీక్షల కోసం, ఒక వరం రోజులు షూటింగ్స్ కి సెలవులు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు గుంటూరు కారం, వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న, ఈ ముద్దుగుమ్మ పుస్తకాలతో కుస్తీకి సిద్ధమైపోయింది. ప్రొఫెషనల్ చదువు లేనివారే, సినీ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు అనే రూమర్స్ కి లేటెస్ట్ గా శ్రీలీల తన క్వాలిఫికేషన్ తో కుండబద్దలుకొట్టబోతుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో, ఇండస్ట్రీకి కొంగు బంగారంగా మారిన లీల, టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.