SS RAJAMOULI: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. ఇండస్ట్రీలో అందరికీ హాట్ ఫేవరేట్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఏ స్టార్ హీరోని కదిలించినా జక్కన్న జపం చేస్తున్నారు. ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్ వుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా దర్శకధీరుడితో సినిమా చేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి పుణ్యమా అని ఇప్పుడు లాంగ్వేజ్ బారికేడ్స్ అన్నీ బద్దలు అవ్వడంతో తనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ ముందు ఇండస్ట్రీ, బ్లాక్ బాస్టర్ హిట్టే.
RC16 : సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడే..
అలాంటి ఆయన ఛాన్స్ వస్తే చాలు.. మలయాళ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. జక్కన్నకు మాలీవుడ్ సినిమాల మేకింగ్ అన్నా.. వాటి కథలు, అందులో నటించే నటులన్నా మక్కువ ఎక్కువ. గతంలో అనేక సందర్బాల్లో మళయాళ సినిమాల గురించి తన ఇష్టాలను అభిప్రాయాలను ఓపెన్‌గానే చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైమ్‌లో మళయాళ సినిమాను ఎంత రియలిస్టిక్‌గా తీస్తారనే విషయంపై సందీప్ రెడ్డి వంగాతో చర్చించాడు. లీడ్ యాక్టర్స్‌తో పాటు జూనియర్ ఆర్టిస్ట్ విషయంలో కూడా మేకర్స్ చాలా క్లారిటీని మెంటైన్ చేస్తారని చెప్పుకొచ్చారు. అలా మళయాళ సినిమాల మేకింగ్ స్పూర్తితో ఆర్ఆర్ఆర్‌ని రియలిస్టిక్ అప్రోచ్‌తో రాజమౌళి తీసి హాలీవుడ్ దర్శకుల మెప్పును అందుకున్నాడు. రీసెంట్‌గా ప్రేమలు సక్సెస్ మీట్‌లో రాజమౌళి మరోమారు మలయాళ సినీ పరిశ్రమపై చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రేమలు తెలుగు వెర్షన్ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న జక్కన్న.. మలయాళ సినిమా పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
తనకి కొంచెం జెలసిగా.. పెయిన్‌గా కూడా ఉందని.. మళయాళం నుంచి బెటర్ నటులు వస్తున్నారని.. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకొని తీరాలి అని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాక ప్రేమలు హీరోయిన్ నటనకు ఫిదా అయిపోయానని చెప్పాడు. గీతాంజలిలో నటించిన గిరిజ.. ఆ తర్వాత సాయిపల్లవి చూపించిన ఎఫెక్ట్.. మమితా బైజులో చూశానని కితాబ్ ఇచ్చాడు. తన నటనతో ఏకంగా రాజమౌళినే మెప్పించిన ఈ అమ్మాయికి ఫ్యూచర్ అదిరిపోతుందని చర్చించుకుంటున్నారు. చూస్తుంటే SSMB29లో మలయాళం నటులను నింపేసేలా కనిపిస్తున్నాడు జక్కన్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.