SS RAJAMOULI: కాస్తలో ప్రాణం పోయేది.. భూకంపం నుంచి తప్పించుకున్న జక్కన్న ఫ్యామిలీ

ప్రస్తుతం రాజమౌళి వర్క్‌ చేస్తున్న ఓ సినిమా పని మీద రీసెంట్‌గానే రాజమౌళి ఫ్యామిళీ జపాన్‌కు వెళ్లింది. అక్కడే ఓ హోటల్‌లో స్టే చేస్తున్నారు జక్కన. ఇవాళ ఉదయం ఉన్నట్టుంది జక్కన్న కుటుంబం ఉన్న బిల్డింగ్‌ షేక్‌ అవ్వడం స్టార్ట్‌ అయ్యిందట.

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 01:45 PM IST

SS RAJAMOULI: జపాన్‌లో భూకంపాల గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వర్షం పడ్డంత సింపుల్‌గా అక్కడ ఎర్త్‌క్వేక్స్‌ వస్తుంటాయి. అక్కడివాళ్లకంటే అలవాటు కాబట్టి చిన్న చిన్న భూకంపాలను పెద్దగా పట్టించుకోరు. కానీ కొత్తగా జపాన్‌ వెళ్లినవాళ్లకు. భూకంపాన్ని ఫస్ట్‌ టైం ఎక్స్‌పీరియన్స్‌ చేస్తున్నవాళ్లకు మాత్రం హార్ట్‌ ఆగిపోయినంత పనౌతుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్‌ను ఫేస్‌ చేసింది దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం.

Chiranjeevi: మెగా రిస్క్.. బురదలో చిరంజీవి.. అందుకే మెగాస్టార్ అయ్యారు!

ప్రస్తుతం రాజమౌళి వర్క్‌ చేస్తున్న ఓ సినిమా పని మీద రీసెంట్‌గానే రాజమౌళి ఫ్యామిళీ జపాన్‌కు వెళ్లింది. అక్కడే ఓ హోటల్‌లో స్టే చేస్తున్నారు జక్కన. ఇవాళ ఉదయం ఉన్నట్టుంది జక్కన్న కుటుంబం ఉన్న బిల్డింగ్‌ షేక్‌ అవ్వడం స్టార్ట్‌ అయ్యిందట. కాసేపటివరకూ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదట. భూకంపం వచ్చిందని గుర్తించేలోపే ప్రకంపణలు ఆగిపోయి వర్షం పడటం స్టార్ట్‌ అయ్యిందట. ఈ ఇన్సిడెంట్‌ జరిగినప్పుడు జక్కన్న ఫ్యామిళీ ఆ హోటల్‌లోని 28వ ఫ్లోర్‌లో ఉన్నారల. ఏం జరగలేదు కాబట్టి అంతా నార్మల్‌. కానీ పొరపాటున భూకంపం ప్రభావం పెరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగేది. ఈ విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఎర్త్‌క్వేక్‌ గురించి తన వాచ్‌లో వచ్చిన నోటిఫికేషన్‌ను ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

భూకంపాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేయడం మొదటిసారి అని.. ప్రాణం పోతుందేమే అనిపించిందంటూ చెప్పాడు. తాము భయపడ్డా కానీ అక్కడి పబ్లిక్‌ అంతా ఆ భూకంపాన్ని చాలా నార్మల్‌గా తీసకున్నారంటూ చెప్పాడు. కార్తికేయ చేసిన ఈ పోస్ట్‌ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. సేఫ్‌గా ఉండంటి అంటూ నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా కామెంట్లు పెడుతున్నారు. త్వరగా ఆ పనేదో చూసుకుని ఇండియాకు వచ్చేయ్‌ జక్కన్న అంటూ జాగ్రత్తలు చెప్తున్నారు.