SS Rajamouli: గుంటూరుకారం టాకీ పార్ట్ నవంబర్ ఎండ్‌కి పూర్తి కానుంది. ప్యాచ్‌వర్క్ సాంగ్ షూటింగ్ డిసెంబర్‌లో పూర్తికాబోతోంది. సో.. జనవరి నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్రీ అయిపోతాడు. కాబట్టి అప్పుడు రాజమౌళి మూవీ లాంచ్ అవుతుంది. వర్క్ షాపులు మొదలవుతాయన్నారు. సీన్ చూస్తే అలా లేదు. ఏప్రిల్ వరకు ఇంకా స్క్రిప్ట్ వర్కే నడుస్తుందట. ఎప్పుడో మొదలైన ఈ సినిమాకు కథా రచన ఇంకా పూర్తి కాలేదా అంటే కానే కాదు. కథ ఎప్పుడో సిద్దం.
కాని పార్ట్-2కి కూడా ప్లానింగ్ జరుగుతోంది. అందుకే ఏప్రిల్ 4 లోగా రెండో భాగం కూడా కథని సిద్దం చేసి, అప్పుడు వర్క్ షాపులు ప్లాన్ చేయాలనుకుంటున్నాడట రాజమౌళి. సో.. త్రిబుల్ఆర్‌కి చేసిన మిస్టేక్ మహేశ్ బాబు మూవీకి చేయొద్దని, రెండో భాగాన్నిముందే ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. బాహుబలి 1,2 లానే మహేశ్ సినిమాను రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నాడు. ఏప్రిల్‌లోగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, ఏప్రిల్ ఎండింగ్‌లో మూవీని లాంచ్ చేస్తారట. ఇక ఏప్రిల్ చివరి వారం నుంచి వర్క్ షాపులు, మేకింగ్ తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారని తెలుస్తోంది.
సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. అంటే 2025 లో సినిమా రిలీజా అంటే, అది కూడా కష్టమే. కనీసం రెండేళ్లు మేకింగ్‌కు, పోస్ట్ ప్రొడక్షన్‌కి టైం కేటాయిస్తున్నాడట జక్కన్న. సో.. 2026 వరకు మహేశ్ బాబు వచ్చే ఛాన్స్ లేదనుకోవాలి. కాకపోతే 2026, 2027 వరుసగా రెండేళ్లు రెండు సినిమాలు వస్తాయని మాత్రం ప్రచారం జరుగుతోంది.