SS RAJAMOULI: సుకుమార్ వల్ల అయ్యింది.. దర్శకధీరుడి వల్ల కాలేదా..?

దర్శక ధీరుడే అయినా.. తను ఒక విషయంలో తనకి తెలియకుండానే తప్పు చేశాడు. అదే తన శిష్యులను ఇండస్ట్రీకి అందించటంలో రాజమౌళి విఫలయ్యాడు. పూరీజగన్నాథ్, గుణశేఖర్, తేజ.. ఇలా చాలా మంది వర్మ శిష్యులుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

  • Written By:
  • Updated On - April 30, 2024 / 07:17 PM IST

SS RAJAMOULI: రాజమౌలి దర్శక ధీరుడు. సౌత్ సినిమాను పట్టించుకోని నార్త్ మార్కెట్‌లో దక్షిణాది సినిమాలకు గేట్లు తెరిచాడు. బాహుబలి, త్రిబుల్ ఆర్‌తో తనేంటో ఈ ప్రపంచానికి రుచి చూపించాడు. అలాంటి తను ఒక విషయంలో తల దించుకోవాల్సి వస్తోంది. దర్శక ధీరుడే అయినా.. తను ఒక విషయంలో తనకి తెలియకుండానే తప్పు చేశాడు. అదే తన శిష్యులను ఇండస్ట్రీకి అందించటంలో రాజమౌళి విఫలయ్యాడు.

Prabhas: రేసులో ఆ ఇద్దరు.. ప్రభాస్ హీరోయిన్ వేటలో సందీప్ రెడ్డి

పూరీజగన్నాథ్, గుణశేఖర్, తేజ.. ఇలా చాలా మంది వర్మ శిష్యులుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక పూరీ శిష్యులుగా హరీష్ శంకర్, పరశురామ్ అండ్ కో కూడా ఇండస్ట్రీని ఏలుతున్నారు. విచిత్రం ఏంటంటే సుకుమార్ శిష్యులు ఒక్కొక్కరిగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఉప్పెన తీసిన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్‌తో సినిమా తీస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దసరా తర్వాత మరోసారి నానితో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడు. ఇక కుమారి 21 ఎఫ్ మూవీతో సూర్య ప్రతాప్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ప్రసన్న వదనంతో అర్జున్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇలా సుకుమార్, పూరీ శిష్యులు దర్శకులుగా మారి ఇండస్ట్రీని ఏలుతుంటే.. రాజమౌళి శిష్యులెవరంటే ఆన్సర్ చెప్పలేని పరిస్థితి.

ఒకరిద్దరు శిష్యులు సినిమాలు తీసినా వాళ్లు పెద్దగా ఫోకస్ కాలేదు. పేరు రాలేదు. ఇంకెవరు లైన్‌లో లేరు. అందుకే ఇండస్ట్రీకి హిట్లిచ్చిన రాజమౌళి ఇండస్ట్రీకి కొత్త దర్శకులుగా తన శిష్యులని అందించలేకపోతున్నాడు. ఆ విషయంలో సుకుమార్, పూరీకంటే చాలా వెనుకపడ్డాడు జక్కన్న.