SS RAJAMOULI: మహేశ్ సినిమా తర్వాత రాజమౌళి హీరో ఎవరు?

బాహుబలి ఎండ్ అవుతున్నప్పుడే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ అన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆతర్వాత మహేశ్ బాబుతో సినిమా అనేశాడు. అన్నట్టుగానే సూపర్ స్టార్‌తో సినిమా తీసే పనిలో ఉన్నాడు.

  • Written By:
  • Updated On - February 17, 2024 / 08:09 PM IST

SS RAJAMOULI: దర్శక ధీరుడు రాజమౌళి మహేశ్‌తో తీసే సినిమా మహారాజా, చక్రవర్తి.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ప్రచారం పెంచారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా మరో రెండేళ్లలో పూర్తవుతుంది. ఆ తర్వాతి సినిమా ఏంటనే ప్రశ్నకు రాజమౌళి దగ్గర సమాధానం ఉందా? ఎందుకంటే తను ఈగ తీసేటప్పుడే ప్రభాస్‌తో మూవీ అన్నాడు. అన్నట్టుగానే బాహుబలి రెండు భాగాలు తీశాడు.

CHIRANJEEVI: తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో మెగాస్టార్

బాహుబలి ఎండ్ అవుతున్నప్పుడే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ అన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆతర్వాత మహేశ్ బాబుతో సినిమా అనేశాడు. అన్నట్టుగానే సూపర్ స్టార్‌తో సినిమా తీసే పనిలో ఉన్నాడు. ఇలా ఒక సినిమా సెట్స్ పైనుండగానే, ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎవరితోనో ముందే కన్ఫామ్ చేసుకుంటాడు జక్కన్న. కాని మహేశ్ మూవీ తాలూకు పనులు మొదలౌతున్నాయి. రిహార్సల్స్ మూడు నెలలు జరగబోతున్నాయి. కాని ఇప్పటి వరకు తన నెక్ట్స్ హీరో ఎవరో తేలలేదు.

మళ్లీ ప్రభాస్, లేదంటే తారక్, చరణ్‌తో సినిమాలు తీస్తాడా అంటే, వాళ్లు రెండేళ్లు బిజీ. కాబట్టి ఈలోపు మహేశ్ మూవీ అయిపోతుంది. సో.. వాళ్లతోసినిమా తీసే ఛాన్స్ ఉంది. కాని ఇంకా ఏది ఎనౌన్స్ కాలేదు. మహేశ్ మూవీ లాంచింగ్ రోజేమైనా నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద హింట్స్ రావొచ్చనే అంచనాలు మాత్రం ఉన్నాయి.