MaheshBabu: #SSMB29తో మరో ఆస్కార్‌కు గురి పెట్టిన జక్కన్న ?

ఓ వైపు ఫ్లాప్‌ స్పెల్లింగ్‌ కూడా రాని డైరెక్టర్‌.. మరో వైపు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌లో తిరుగులేని హీరో.. సినిమా కోసం పని చేసేందుకు ఖండాలు దాటి వస్తున్న హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌. ఇవి చాలు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి.

ఓ వైపు ఫ్లాప్‌ స్పెల్లింగ్‌ కూడా రాని డైరెక్టర్‌.. మరో వైపు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌లో తిరుగులేని హీరో.. సినిమా కోసం పని చేసేందుకు ఖండాలు దాటి వస్తున్న హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌. ఇవి చాలు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ గురించి కొన్ని లీకులు ఇచ్చి.. సినిమా మీద అమాంతం హైప్‌ క్రియేట్‌ చేశారు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌. ఇప్పుడు ఇటు సినీ అభిమానులు, అటు విశ్లేషకుల మదిలో ఉన్న డౌట్‌.. SSMB29 తో రాజమౌళి ఆస్కార్‌ కొడతారా అని. తెలుగు సినిమాకు ఆస్కార్‌ ఓ కొలమానం కాకపోయినా.. సినీ ప్రపంచంలో ఆస్కార్‌ అవార్డ్‌ అంటే చాలా ప్రతిష్టాత్మకం. అందుకే అంతా ఆస్కార్‌ కోసం పోటీ పడతారు. రాజమౌళి టార్గెట్‌ కూడా తరువాతి సినిమాతో బెస్ట్‌ సినిమా కేటగిరీలో ఆస్కార్‌ అవార్డ్‌ అందుకోవడమే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. అప్పట్లో బాహుబలి సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బాహుబలి విషయంలో జరిగిన మిస్టేక్స్‌ను కవర్‌ చేస్తూ.. ట్రిపులార్‌ సినిమాను ఆస్కార్‌కు తీసుకువెళ్లేలా ప్లాన్‌ చేశాడు జక్కన్న. అంతా అనుకున్నట్టుగా సినిమాకు కాకపోయినా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌ వచ్చింది. అయితే ఇప్పుడు ట్రిపులార్‌లో జరిగిన మిస్టేక్స్‌ను ఓవర్‌కం చేస్తూ.. SSMB29 ను జక్కన్న తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ఆస్కార్‌ అవార్డ్‌ అంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకుని ఇస్తారు. బాహుబలి, ట్రిపులార్‌ సినిమాలతో వాటి గురించి ఇప్పటికే ఓ క్లారిటీ తెచ్చుకున్నారు రాజమౌళి. దీంతో ఈసారి ఖచ్చితంగా అవార్డ్‌ కొట్టేలా ప్లాన్‌ చేస్తున్నాడట. దీనికి తోడు ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా మంది హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ రానున్నారు. హాలీవుడ్‌ యాక్టర్స్‌ కూడా సినిమాలో పెద్ద సంఖ్యలో ఉండనున్నారు. ఇక ప్రతీ సినిమాతో తనను తాను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ వెళ్తున్నాని రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మాటకు తగ్గట్టుగానే మగధీరను మర్చిపోయేలా బాహుబలి తీశారు. బాహుబలిని తలదన్నేలా ట్రిపులార్‌ తెరకెక్కించారు. ఇప్పుడు మహేష్‌తో చేసే సినిమా ట్రిపులార్‌కు మించి ఉండటంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ ట్రిపులార్‌ క్రియేట్‌ చేసిన వండర్‌ అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని చుట్టేసింది. దీన్ని తలదన్నేలా సినిమా ఉంటుంది అంటే.. SSMB29 ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విశ్లేషకుల అంచనాలు నిజమై.. రాజమౌళి ఇదే రేంజ్‌లో దూసుకువెళ్తే SSMB29కు ఆస్కార్‌ దాసోహం కాక తప్పదు.