SS Rajamouli: మహేశ్ బాబు నిర్ణయానికి.. ఫిదా అయిన రాజమౌళి..

మహేశ్ బాబు బేసిగ్గా డైరెక్టర్స్ స్టార్ అంటారు. దర్శకుడు ఏం చెబితే అది చేసే హీరో అంటారు. అలాంటి తను ఫస్ట్ టైం రాజమౌళి మూవీ లో హీరోయిన్ ని తానే నిర్ణయించాడట. అలా దీపికా పదుకొనే ఇప్పుడు మహేశ్ సరసన మెరవబోతోందట.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 04:19 PM IST

ఆల్రెడీ దీపికా పదుకొనే ఇప్పుడు ప్రాజెక్ట్ కేలో ప్రభాస్ సరసన మెరుస్తోంది. ఆతర్వాత హిందీ మూవీ వార్ సీక్వెల్ వార్ 2 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేయసి పాత్రలో కన్ఫామ్ అయ్యింది. ఇలా ఇద్దరితో జోడీకట్టిన, కడుతున్న దీపికా ముచ్చటగా మూడో సారి తెలుగు స్టార్ సినిమాకు సై అందట. నిజానికి మహేశ్ వైఫ్ నమ్రతతో దీపికకు మంచి స్నేహం ఉండటంతో, అలా రాజమౌళి మూవీకి మహేశ్ దీపికా పేరుని సజెస్ట్ చేసి ఉండొచ్చే అభిప్రాయముంది. ఐతే మహేశ్ చేసిన పనివల్ల జక్కన్నకు మంచే జరిగిందట. తను కూడా దీపికానే అనుకుంటున్నాడు. కాని మహేశ్ ద్వారా దీపికా సై అనటం వల్ల 200 కాల్ షీట్స్ ఇచ్చిందట దీపికా.. కథ పూర్తై, కథనం రాస్తూ బిజీ అయిన జక్కన్నకు మహేశ్ బాబు సగం భారం తగ్గించాడంటున్నారు.

ఇక టాలీవుడ్ లో దేవర అంటూ తారక్ తో జోడీకట్టి జాన్వీకపూర్, తర్వాత బుచ్చి బాబు మేకింగ్ లో చరణ్ తో, ఆవెంటనే త్రివిక్రమ్ మేకింగ్ లో బన్నీతో జోడీకడుతోంది. సో దీపినా, జాన్వీ ఈ ఇద్దరే వరుసగా ముగ్గురు తెలుగు హీరోలతో జోడీకట్టే ఛాన్స్ పడుతూ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు.