SS RAJAMOULI: దర్శకధీరుడు రాజమౌళి వల్లే టాలీవుడ్‌కు బాలీవుడ్ తలుపులు తెరుచుకున్నాయి. బాలీవుడ్ మార్కెట్ బద్దలు కొట్టి, బాహుబలితో బాక్సాఫీస్ లెక్కే మార్చాడు. రాజమౌళి వల్లే తాను పొన్నియన్ సెల్వన్ సినిమాను రెండు భాగాలుగా తీయగలిగా అని లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అన్నాడు. ఇలా మణిరత్నానికే కాదు, శంకర్ నుంచి సందీప్ రెడ్డి వంగ వరకు.. రాజమౌళి పరోక్షంగా మార్గ నిర్దేశకత్వం చేస్తున్నాడు. అసలు యానిమల్ మూవీకి రెండో భాగం అన్న ఆలోచనే సందీప్ రెడ్డి వంగకి లేదు.
Animal Trailer: ఊచకోత.. యానిమల్ విధ్వంసం.. వేరే లెవల్ అంతే..!
కాని రాజమౌళి సలహా వల్లే సందీప్ యానిమల్ 2 కూడా ప్లాన్ చేశాడట. ఇదేనా.. సలార్ విషయంలో కూడా దర్శక ధీరుడి సలహా పారింది. ప్రశాంత్ నీల్ మేకింగ్‌లో ప్రభాస్ చేసిన సలార్ నిజానికి ఒక భాగంగా ప్లాన్ చేసిందే. కాని సీజ్ ఫైర్ అని మొదటి భాగానికి పేరు పెట్టి, రెండో భాగం ఉందని తేల్చారంటే దానికి కారణం జక్కన్న. అసలు సుకుమార్ పుష్ప మూడు గంటల నిడివితో తీస్తే, రెండు భాగాలుగా తీయమని సలహా ఇచ్చి, ప్రమోట్ చేసిందే రాజమౌళి. కేజీయఫ్ 2 టైంలో రూ.50 కోట్లు పెట్టి ప్రమోషన్ చేయండి.. అంతకి పది ఇరవై రెట్లు వస్తాయని జక్కన్న సలహా ఇవ్వటం.. ప్రశాంత్ నీల్ పాటించటం.. రూ.1200 కోట్ల పైనే వసూల్లు రావటం అంతా జరిగిపోయింది. ఆస్కార్ వేటలో ఎలా నిలుచోవాలి.. ఇలా పాన్ ఇండియా నుంచి గ్లోబల్ మార్కెట్‌లో ఎలా సందడి చేయాలి వంటి చాలా విషయాల్లో సినీ పరిశ్రమకు దారిచూపాడు రాజమౌలి.
ఆ దారిలోనే నడుస్తూ పాన్ ఇండియా సీక్వెల్స్‌తో బిజీ అయ్యారు సదరన్ డైరెక్టర్స్. ఆ ప్రాసెస్ లోనే యానిమల్ 2 తెరకెక్కబోతోంది. కల్కీ 2 తెరకెక్కబోతోంది. ఇలా ఈ లిస్ట్ పెరుగుతూనే ఉంది. దీనంతటికీ కారణం రాజమౌళినే.