SS Rajamouli: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినా.. ఇండియన్ ఫ్యాన్స్ మనోడిని ఓన్ చేసుకున్నారు. వార్నర్ కూడా ఇండియాను సెకండ్ హోమ్‌లా ఫీల్ అవుతున్నాడు. మన దగ్గర జరిగే ప్రతీ పండగకు.. ఎక్కడున్నా సరే సోషల్ మీడియా వేదికగా వార్నర్ విషెస్ చెప్తుంటాడు. ఇక మనోడు వేసే పుష్ప స్టెప్‌కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ వార్నర్.. పుష్ప స్టెప్పులతో అదరగొడుతున్నాడు.
Kadiyam Srihari Vs Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా రాజయ్య.. కడియం మీద ప్రతీకారం తీర్చుకుంటారా..?
ఐతే ఇప్పుడు వార్నర్.. రాజమౌళి డైరెక్షన్‌లో బాహుబలి రేంజ్ మూవీలో యాక్ట్ చేశాడు. ఆగండాగండీ.. ఇదేం నిజం మూవీ కాదులేండీ. ఓ యాడ్‌లో వార్నర్ వేసిన వేషాలు.. చేసిన అల్లరి.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి పొట్ట చెక్కలయ్యేలా చేస్తోంది. రాజమౌళికి ఉన్న ఇమేజ్ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రిపుల్‌ఆర్‌కు ఆస్కార్ వచ్చిన తర్వాత.. జక్కన్న రేంజ్ ఇంటర్నేషనల్‌కు చేరింది. దీంతో ఆయన క్రేజ్‌ను కంపెనీలు వాడుకుంటున్నాయ్. అదే పని చేసింది ఆర్థిక లావాదేవీలు నిర్వహించే క్రెడ్ సంస్థ. రాజమౌళిని అంబాసడర్‌గా తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆయనకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని యాడ్ చేసింది. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన యాడ్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కూడా వెరైటీగా డిజైన్ చేశారు. క్రెడ్ యూపీఐ లేని రాజమౌళి.. తాను మిస్ అవుతున్న లాభాలు పొందటం కోసం.. వార్నర్‌కు ఫోన్ చేస్తాడు.
ఐతే దానికి బదులు.. వార్నర్ ఓ ఫేవర్ అడుగుతాడు. అదే.. తనను హీరోగా పెట్టి సినిమా తీయడం. తీరా ఒప్పుకున్నాక.. తెలుగు రాని వార్నర్ చిత్ర విచిత్రంగా నటించడం.. రాజమౌళికి చుక్కలు చూపించడం జరుగుతాయ్. ఇదంతా ఊహించుకున్న జక్కన్న.. భయమేసి దీనికన్నా క్రెడ్ యూపీఐ తీసుకోవడమే ఉత్తమమని భావించి కాల్ కట్ చేస్తాడు. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వార్నర్ వేసుకున్న వేషాలు.. చేసిన అల్లరి.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని తెగ నవ్విస్తున్నాయ్.