SS RAJAMOULI: మళ్లీ రాజమౌళితో ప్రభాస్ సినిమా.. ఎప్పుడు మొదలవుతుందంటే..

ఆల్రెడీ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా తీసే పనిలో ఉన్నాడు. రెండేళ్లవరకు ఆ ప్రాజెక్టుకే అంకితం కానున్నాడు. అలాంటి తను ప్రభాస్‌తో మళ్లీ సినిమా ఎలా చేస్తాడనే ప్రశ్నకి 2028 ఆన్సర్‌గా కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 05:56 PM IST

SS RAJAMOULI: రాజమౌలి డైరెక్షన్‌లో ప్రభాస్ చత్రపతిగా వచ్చాడు. బాహుబలిగా రెండు సార్లు పాన్ ఇండియా మార్కెట్‌ని షేక్ చేశాడు. ఆ కటౌట్‌కి రాజమౌళితోపాటు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కంటెంట్ తోడైతే ఎలా ఉంటుందో పాన్ ఇండియా మార్కెట్ చూసింది. బాక్సాఫీస్‌లో సునామీ వచ్చింది. అలాంటి పూనకాలు మళ్లీ రాబోతున్నాయా..? ఆల్రెడీ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా తీసే పనిలో ఉన్నాడు.

TRISHA: చిరంజీవి తర్వాత వెంకీ, నాగ్, బాలయ్యతో జోడీ కన్ఫామ్

రెండేళ్లవరకు ఆ ప్రాజెక్టుకే అంకితం కానున్నాడు. అలాంటి తను ప్రభాస్‌తో మళ్లీ సినిమా ఎలా చేస్తాడనే ప్రశ్నకి 2028 ఆన్సర్‌గా కనిపిస్తోంది. 2028లో ప్రభాస్‌తో రాజమౌళి మూవీ పట్టాలెక్కుతుందట. ప్రజెంట్ ప్రభాస్ కల్కిని పూర్తి చేస్తున్నాడు. మార్చ్‌లో జరిగే ప్యాచ్ వర్క్‌తో ఈ సినిమా షూటింగ్‌కి గుమ్మడి కాయ కొట్టేస్తారు. ఏప్రిల్‌లో ప్రమోషన్ తర్వాత జూన్ నుంచి మారుతి మేకింగ్ లో ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేయటం, ఆ తర్వాత హనురాఘవపూడీ మేకింగ్ లో సినిమా ప్రారంభవుతుంది. ఈ సినిమాతోపాటే సలార్ 2 కూడా మొదలు పెట్టబోతున్నాడు ప్రభాస్. ఇక కల్కి 2 ని 2025లో మొదలు పెట్టే ప్రయత్నలు జరుగుతున్నాయి. సలార్ 2 తర్వాత కూడా ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో మూడో సినిమా ప్లాన్ చేశాడు.

ఇవన్నీ చేస్తూనే 2028లో రాజమౌళి డైరెక్షన్‌లో రెండు భాగాలతో మరో పాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ఇక కొరటాల శివ మేకింగ్‌లో కూడా మిర్చి కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. ఇవన్నీ లెక్కేస్తే 8 ఏళ్లలో 10 సినిమాలతో ప్రభాస్ బిజీ కానున్నాడు. అన్నింట్లో రాజమౌళి మూవీ మాత్రం 2028లో పట్టాలెక్కే అవకాశాలున్నాయి.