SS RAJAMOULI: పుకార్లకు ఫుల్‌స్టాప్.. రాజమౌళి ప్రెస్ మీట్.. SSMB 29 కోసమేనా..!

మహేష్ బాబు చిత్రం ఓపెనింగ్ మాత్రం భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లానింగ్ రెడీ చేస్తున్నాడట రాజమౌళి. ఆ ఓపెనింగ్ వేడుకకు స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరూన్‌లను ముఖ్య అతిథులుగా పిలవడానికి ప్రణాళిక చేస్తున్నాడట.

  • Written By:
  • Updated On - February 27, 2024 / 06:25 PM IST

SS RAJAMOULI: తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్‌తో పాటు ప్రపంచ సినిమా స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తన పేరుతోనే జనాలని థియేటర్స్‌కి రప్పించగల దర్శక ధీరుడు. మరి అలాంటి ఆయనకి ఒంటి చేత్తో సినిమాని హిట్ చేసే సత్తా కలిగిన మహేష్ బాబు కలిస్తే ఇంకేమైనా ఉందా..? ఆ మూవీ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. అందుకు ముహూర్తం అతి త్వరలోనే రానుంది. SSMB 29 ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకొంటుంది. తన మూవీకి సెట్ అయ్యే ఆర్టిస్టులని ఎంచుకునే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు.

SPIRIT: స్పిరిట్ కథ రెడీ.. ముందుగానే ప్రారంభం కానున్న షూటింగ్

తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త ప్రపంచాలు ఆవిష్కరించారు జక్కన్న. పైగా హాలీవుడ్ దర్శకులు తీర్చిదిద్దిన సినిమాల ప్రేరణతోనే రాజమౌళి కూడా తన సినిమాల్లో భారీతనానికి పెద్ద పీట వేస్తుంటాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వేరు వేరు సందర్భాల్లో స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరూన్ ఇద్దరూ పొగిడారు. ఒకవిధంగా స్పీల్ బర్గ్ రూపొందించిన ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలోనే మహేష్ బాబు చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. తన సినిమాలను ప్రారంభించే ముందే కథ మొత్తాన్ని పబ్లిక్‌గా చెప్పడం జక్కన్నకి అలవాటు. ఇప్పుడు SSMB 29 విషయంలోనూ అదే చేయబోతున్నాడట. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే ఈ చిత్రం కథ వివరించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. స్టోరీ విషయాన్ని పక్కనపెడితే మహేష్ బాబు చిత్రం ఓపెనింగ్ మాత్రం భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్లానింగ్ రెడీ చేస్తున్నాడట రాజమౌళి.

ఆ ఓపెనింగ్ వేడుకకు స్పీల్ బర్గ్, జేమ్స్ కేమరూన్‌లను ముఖ్య అతిథులుగా పిలవడానికి ప్రణాళిక చేస్తున్నాడట. గతంలో శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమా కోసం హాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ వచ్చాడు. అప్పట్లో అదో సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు రాజమౌళి-మహేష్ బాబు సినిమా ప్రారంభోత్సవానికి ఈ హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ వస్తే.. పాన్ వరల్డ్ రేంజులో సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీని దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఈ సంస్థ నుంచి గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెక్కుతుండగా విజయేంద్ర ప్రసాద్ కథని అందించాడు. ఇండియన్ టెక్నీషియన్సే కాకుండా విదేశీ టెక్నీషియన్స్ కూడా వర్క్ చెయ్యనున్నారు.