SS RAJAMOULI: ఇండియన్ సినిమా ఫేట్ మార్చే మూవీ రానుందా..?

బాహుబలి సౌత్, నార్త్ మధ్యల అడ్డుగోడల్ని కూల్చిందన్నారు. కానీ, రష్యా, జర్మని, జపాన్, ఆస్ట్రేలియాలో ఇండియాన్ సినిమా స్థాయిని పెంచింన మూవీ కూడా ఇదే. బాహుబలి 2 కూడా అలానే సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్రిబుల్ ఆర్ పాటకి యూరోపీయన్స్ డాన్స్ చేసే పరిస్థితొచ్చింది.

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 08:07 PM IST

SS RAJAMOULI: ఇండియన్ సినిమాని వరల్డ్ ప్లాట్ ఫాంలో ఫోకస్ అయ్యేలా చేసిన వ్యక్తి ఒకప్పడు సత్య జిత్ రే. ఇప్పుడు రాజమౌళి. ఇది వింటానికి అతిశయోక్తిలా అనిపించొచ్చు. కానీ, రియాలిటీ అలానే ఉంది. బాహుబలి సౌత్, నార్త్ మధ్యల అడ్డుగోడల్ని కూల్చిందన్నారు. కానీ, రష్యా, జర్మని, జపాన్, ఆస్ట్రేలియాలో ఇండియాన్ సినిమా స్థాయిని పెంచింన మూవీ కూడా ఇదే. బాహుబలి 2 కూడా అలానే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Devara: దేవర సిద్ధం.. క్లైమాక్స్ షూట్‌కు భైరా వచ్చేస్తున్నాడు..!

త్రిబుల్ ఆర్ పాటకి యూరోపీయన్స్ డాన్స్ చేసే పరిస్థితొచ్చింది. ఆస్కార్ కూడా వచ్చింది. ఇలా ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి, మరీ ముఖ్యంగా వరల్డ్ సినిమా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. అందులో షోలే ఒకటి. ఈజిప్ట్‌లో ఇండియన్ అంటే అమితాబ్ బచ్చనే. ఇక దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే వల్ల మిడిల్ ఈస్ట్‌లో ఇండియన్ సినిమా స్థాయి పెరిగింది. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ వల్ల అమెరికా, యూరప్‌లో ఇండియన్ సినిమా అంటే ఆటలు, పాటలే కాదు అని ప్రూవ్ చేసింది. ఇక లగాన్‌తో ఇంగ్లీష్ కంట్రీస్‌లోనే కాకుండా యూరప్‌లో కూడా మన ఇండియన్ సినిమా పాపులరైంది.

బాహుబలితో ఒక్కసారిగా మన గ్రాఫిక్స్ మాయాజాలం, స్టోరీ టెల్లింగ్ పాపులరైంది. త్రిబుల్ ఆర్ కూడా అలానే వరల్డ్ మార్కెట్‌ని కొంతవరకు షేక్ చేయబోయింది. సో.. ఒక్కో జెనరేషన్‌లో ఒక్కో భాషలోని సినిమాలు ఇండియన్ సినిమా స్థాయిని పెంచితే, ఒకే భాషలో మూడు సార్లు ఈ ఫీట్ సాధించిన రాజమౌళి, ఇప్పడు మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మార్కెట్‌ని షేక్ చేయబోతున్నాడు.