GUNTUR KAARAM: మహేశ్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..

మహేశ్ ఫ్యాన్స్ వేసిన ప్రశ్నకి తమన్ ఇచ్చిన సమాధానం చూస్తే తను చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. రీసెంట్‌గా గుంటూరు కారం గురించి ఒక్క మాటలో చెప్పమని మహేశ్ ఫ్యాన్ అడిగితే, జనవరి 12న థియేటర్స్‌లో మోతమోగుతుందన్నారు.

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 05:51 PM IST

GUNTUR KAARAM: తమన్ ఈమధ్య తరుచూ ట్రోలింగ్స్‌కి గురవుతున్న మ్యూజిక్ డైరెక్టర్. మొన్నే భగవంత్ కేసరికి సరైన మ్యూజిక్ చేయలేదని కామెంట్లు పేల్చారు. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో కూడా ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరేలా ఉన్నారు. ఎందుకంటే తమన్ పుసుక్కన చేతులెత్తేసిన విషయం ఒప్పుకోవటమే. గుంటూరు కారం మొదలైనప్పటినుంచి తమన్ పనితనం నచ్చకే మహేశ్ బాబు తనని పక్కన పెట్టే ప్రయత్నం చేశాడు. కాని త్రివిక్రమ్ సీన్‌లోకొచ్చి సూపర్ స్టార్‌ని కన్విన్స్ చేశాడన్నారు.

ఏదేమైనా గుంటూరు కారం సాంగ్ ఈనెలాఖర్లోగా వస్తుంది. ఒకవేళ మిస్ అయితే తప్పకుండా దీపావళికి రిలీజ్ అవుతుంది అన్నారు. కాని కనుచూపుమేరలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. మహేశ్ ఫ్యాన్స్ వేసిన ప్రశ్నకి తమన్ ఇచ్చిన సమాధానం చూస్తే తను చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. రీసెంట్‌గా గుంటూరు కారం గురించి ఒక్క మాటలో చెప్పమని మహేశ్ ఫ్యాన్ అడిగితే, జనవరి 12న థియేటర్స్‌లో మోతమోగుతుందన్నారు. అంతే తప్ప మొదటి పాట ఎప్పుడొస్తుందో తేల్చలేదు. అసలు హింట్ కూడా ఇవ్వలేదు. అసలు ఆ పాట వచ్చేదెన్నడో తేలట్లేదు. మొన్న దసరాకే పాట విడుదల చేయాల్సింది. తమన్ లేజీనెస్ వల్ల సాంగ్ రెడీ కాలేదని తెలుస్తోంది. కనీసం షూటింగ్ జరిగిన పాట ఫైనల్ మిక్సింగ్ అయ్యిందా అంటే అదీ లేదు.

ఇలానే శంకర్ మేకింగ్‌లో చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ పాట దసరాకు రాకుండా అయిపోయింది. దీపావళికి ఆ పాటని విడుదల చేసేందుకు తమన్ తన వంతుగా ఫైనల్ మిక్సింగ్‌తో బిజీ అయ్యాడట. మరి గుంటూరు కారం సాంగ్ ఎప్పడు పూర్తి చేస్తాడో దేవుడికే తెలియాలి.