#SSMB28: మహేష్‌ ఫ్యాన్స్‌ రెడీగా ఉండడి..రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న SSMB28 గురించి బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్స్‌ అదరగొడుతున్నారు మూవీ టీం. ఇప్పటికే సినిమా టైటిల్‌ను ఫైనల్‌ చేసిన మూవీ టీం ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు.

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 08:30 AM IST

2024 జనవరి 13న సినిమాను రిలీజ్‌ చేనున్నట్టు తెలిపారు. త్రివిక్రం మహేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. గతంలో వచ్చిన రెండు సినిమాలు అతడు, ఖలేజా మంచి టాక్‌ తెచ్చుకున్నా బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా నిలబడలేకపోయాయి. దీంతో ఇప్పుడు వస్తున్న సినిమా మీదే అందరి దృష్టి ఉంది. ఈ సినిమా టైటిల్‌ను కూడా రీసెంట్‌గా ఫైనల్‌ చేసినట్టు సామాచారం. “అమరావతికి అటు ఇటూ” అనే టైటిల్‌ను సినిమాకు ఫిక్స్‌ చేశారట.

ముందు ఈ సినిమాకు అమ్మ కథ అనే టైటిల్‌ అనుకున్నారు. కానీ ఫ్యాన్స్‌ నుంచి బీభత్సమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇదేం టైటిల్‌ గురుజీ అంటూ ఫ్యాన్స్‌ ఆడుకున్నారు. ఫ్యాన్స్‌ పోరు పడలేకపోయారో.. లేక టైటిల్‌ సెట్‌ కాలేదు అనుకున్నారో తెలియదు కానీ.. టైటిల్‌ మాత్రం మార్చేశారు. దీనిపై అఫిషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. టైటిల్‌ ఫిక్స్‌ చేయడమే కొత్త అప్‌డేట్‌ అనుకుంటే రిలీజ్‌ డేట్‌ కూడా చెప్తూ పోర్టర్‌ రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో మహేష్‌ స్టిల్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నాడు. ఒక్కడు సినిమా రోజులను గుర్తు చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా సినిమా షూటింగ్‌ ఫాస్ట్‌గా కానిచ్చేస్తున్నాడు త్రివిక్రమ్‌.