పైప్ స్మోకింగ్ కు బానిసైపోయిన స్టార్ హీరో… బయటకు రాలేక కష్టాలు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గత పదేళ్ల నుంచి కాస్త స్లో అయ్యాడు. భారీ బడ్జెట్ సినిమాలతో పక్కా లెక్కలతో ఈ సీనియర్ హీరో సినిమాలు చేస్తూ డిఫరెంట్ ట్రెండ్ కోసం ఎప్పుడు ట్రై చేస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - December 25, 2024 / 06:29 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గత పదేళ్ల నుంచి కాస్త స్లో అయ్యాడు. భారీ బడ్జెట్ సినిమాలతో పక్కా లెక్కలతో ఈ సీనియర్ హీరో సినిమాలు చేస్తూ డిఫరెంట్ ట్రెండ్ కోసం ఎప్పుడు ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో కాస్త ఆలస్యం అయినా అభిమానులకు మాత్రం పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని మళ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. 2022 లో వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సినిమాను భారీ అంచనాలతో అమీర్ ఖాన్ ఆ సినిమా చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది.

రీసెంట్ గా తన భార్య కిరణ్ రావు తో విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ ఎప్పుడు సింగిల్ గానే ఉంటున్నాడు. పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా ఎప్పటి నుంచొ జరుగుతుంది. లేటెస్ట్ గా నానా పటేకర్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన హామీర్ ఖాన్ తన పర్సనల్ లైఫ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పర్సనల్ లైఫ్ లో తనకు అసలు డిస్ప్లేన్ లేదని కానీ సినిమా షూటింగ్స్ కు మాత్రం టైం కి వెళ్లే వాడినని గుర్తు చేసుకున్నాడు. అలాగే తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కూడా బయట పెట్టాడు అమీర్ ఖాన్.

పైప్ స్మోకింగ్, మద్యపానం ఎక్కువగా చేసేవాడినని.. తప్పు చేస్తున్నానని ఒకానొక సమయంలో తాను గ్రహించినా ఫుల్ స్టాప్ పెట్టలేక ఇబ్బంది పడ్డానని… అయితే తన వ్యక్తిగత జీవితంలో సినిమానే మార్పులు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చాడు. తనకు సినిమా మెడిసిన్ లాంటిదని ఏడాదికి ఒక సినిమా చేయాలని పట్టుదలగా పెట్టుకుని ఆ తర్వాత అలవాట్ల నుంచి బయటకు వచ్చాను అని అమీర్ ఖాన్ తన కెరీర్ లో ఎదురైన పరిస్థితులను వివరించాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాను ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.

ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. మహాభారతం విషయంలో అమీర్ ఖాన్ భారీగా పెట్టుబడి పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నాడు. స్వయంగా తానే ఆ సినిమాను నిర్మించడానికి మరో నిర్మాత లేకుండానే రిస్క్ చేయడానికి అమీర్ ఖాన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో ఆ సినిమాను తెరకెక్కించేందుకు అమీర్ ఖాన్ ప్లాన్ చేసుకున్నాడు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ఇప్పటి నుంచే వర్క్ మొదలుపెట్టాడు. ఖాళీ సమయంలో ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నట్టు టాక్.