గత కొన్నాళ్ళుగా బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్ , ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ ల డేటింగ్ గురించి ఎన్నో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాల నేపధ్యంలో యువ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. తాను డేటింగ్ యాప్‌లో ఆదిత్య, హృతిక్‌ల ప్రొఫైల్‌లను చూశానని సంచలన వ్యాఖ్యలు చేసింది ఊర్వశి. హౌటర్ ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. డేటింగ్ యాప్ లో ఆదిత్య రాయ్ కపూర్, హృతిక్ రోషన్ ప్రొఫైల్ లు తనకు పలుమార్లు కనిపించాయని పేర్కొంది.
ఊర్వశి మాట్లాడుతూ, తాను కూడా రాయ అనే డేటింగ్ యాప్ లో ఉన్నా… కేవలం తాను తన స్నేహితులే కోసమే ఉన్నా గాని రిలేషన్ కోసం కాదని చెప్తూ… స్టార్ హీరో హృతిక్ రాయలో ఉన్నాడని ఆమె పేర్కొంది. అలాగే… ఆదిత్య రాయ్ కపూర్ కూడా రాయలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడని వాళ్ళు ఇద్దరే కాకుండా చాలా మంది ప్రముఖులు ఈ యాప్ లో ఉన్నారని తెలిపింది. ఇక వాళ్ళ ప్రొఫైల్స్ ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసారా అని ప్రశ్నించగా… వాళ్ళ ఫోన్ నంబర్స్ తన వద్ద ఉన్నాయని… కాబట్టి వల్ల ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూడలేదు అని తెలిపింది.
ఈ యాప్ లో ఎవరికి అయినా మెసేజ్ చేయాలి అంటే కొంత మొత్తం పే చేయాల్సి ఉంటుందని ఊర్వశి పేర్కొంది. తాను చాలా బిజీగా ఉన్నా అని, ఖాళీగా ఉంటే వాళ్ళతో మాట్లాడతా అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే హృతిక్ సబా ఆజాద్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఊర్వశి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఆదిత్య… అనన్య పాండేతో బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల రాయ ప్రొఫైల్స్ కి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఊర్వశి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.