Nayanthara : మొగుడి కోసం నయన్ పాట్లు

విఘ్నేష్‌ శివన్‌తో పెళ్లి తర్వాత నయతారకు బరువు బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పిల్లలను చూసుకోవడం ఏ తల్లయినా చేసే పనే అయినా.. భర్త కెరీర్‌ను నిలబెట్టడం కోసం తన ఇమేజ్‌ను పక్కన పెట్టింది నయన. ఇద్దరు పిల్లల ఆలనాపాలనతో పాటు.. మొగుడు కెరీర్‌ను చక్కదిద్దుతోంది నయన. విఘ్నేష్‌ శివన్‌ మెగాఫోన్‌ పట్టి 11 ఏళ్లయినా.. ఇప్పటివరకు ఐదు సినిమాలే డైరెక్ట్ చేశాడు.

విఘ్నేష్‌ శివన్‌తో పెళ్లి తర్వాత నయతారకు బరువు బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పిల్లలను చూసుకోవడం ఏ తల్లయినా చేసే పనే అయినా.. భర్త కెరీర్‌ను నిలబెట్టడం కోసం తన ఇమేజ్‌ను పక్కన పెట్టింది నయన. ఇద్దరు పిల్లల ఆలనాపాలనతో పాటు.. మొగుడు కెరీర్‌ను చక్కదిద్దుతోంది నయన. విఘ్నేష్‌ శివన్‌ మెగాఫోన్‌ పట్టి 11 ఏళ్లయినా.. ఇప్పటివరకు ఐదు సినిమాలే డైరెక్ట్ చేశాడు. 2012 ‘పోడా పోడి’ అనే ఫ్లాప్‌ మూవీతో కెరీర్‌ స్టార్ట్ చేశాడు. రెండో మూవీ ‘నానమ్‌ రౌడీధాన్‌’తో హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత చెప్పుకునే సక్సెస్‌ పడలేదు. సూర్యాతో గ్యాంగ్‌.. విజయ్‌సేతుపతితో రెండో మూవీ ‘KRK’తీసినా సక్సెస్‌ దక్కలేదు. అజిత్‌తో అనుకున్న సినిమా క్యాన్సిల్‌ అయింది. ఎట్టకేలకు క్రేజీ యంగ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథ్‌ను ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ అందుకున్నాడు విఘ్నేశ్‌.

జవాన్‌లో షారూక్‌తో జతకట్టిన నయనకు పాన్‌ ఇండియా ఇమేజ్‌ దక్కింది. ఈ వెయ్యి కోట్ల సినిమాతో ఒక్కసారి 10 కోట్ల హీరోయిన్‌ అయిపోయింది నయన. ఈ క్రేజీ భామ కోసం .. స్టార్స్‌ వెయిట్ చేస్తుంటే.. తనకున్న స్టార్‌డమ్‌ పక్కన పెట్టి.. విఘ్నేష్‌ శివన్‌ సినిమాలో హీరోకు అక్కగా నటిస్తోంది నయన. ప్రదీప్‌ రంగనాథ్‌ నటిస్తూ.. డైరెక్ట్‌ చేసిన ‘లవ్‌ స్టోరీ’ తమిళంతోపాటు తెలుగులోనూ హిట్ అయింది. హీరో డేట్స్‌తో నిండిన ప్లేట్‌ను ఇచ్చి.. ఇవిగో నా డేట్స్‌ అంటూ.. సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన వీడియో గతంలో రిలీజ్‌ చేశారు. సినిమాలో ప్రదీప్‌ అక్కగా నయనతార నటిస్తోంది. జవాన్‌ తర్వాత నయనతార బాలీవుడ్‌ స్టార్స్ లిస్ట్‌లో చేరిపోయింది. 10 కోట్లు అడిగినా ఇచ్చే పరిస్థితి. డబ్బు.. క్రేజ్‌ అంతా పక్కన పెట్టి విఘ్నేష్‌శివన్‌ను డైరెక్టర్‌గా నిలబెట్టడానికి స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి హీరోకు అక్కగా మారిపోయింది నయన.