Shruti Haasan : మీకు చెప్తా పెళ్లి కాలేదు.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ..

శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటించింది. అవి మంచి హిట్ ను అందుకోవడం తో సంక్రాంతి హీరోయిన్ అయ్యింది.

శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటించింది. అవి మంచి హిట్ ను అందుకోవడం తో సంక్రాంతి హీరోయిన్ అయ్యింది. అయితే గత కొద్ది రోజుల నుంచి శృతిహాసన్ పెళ్లిపై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా త్వరలో పెళ్లి అని వార్తలు వినిపిస్తున్నాయి.

తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్టార్‌ హీరోయిన్ శృతిహాసన్‌ స్పందించింది. తన బాయ్‌ ఫ్రెండ్ శాంతను హజారికను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వదంతులపై బ్యూటీ స్పష్టత ఇచ్చింది. తాను హజారికాను పెళ్లి చేసుకోలేదని.. ఒకవేళ పెళ్లి చేసుకుంటే తప్పకుడా అందరికీ చెప్తానని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రతీ విషయాన్ని అందరితో షేర్‌ చేసుకునే తన పెళ్లి విషయాన్ని ఎలా దాచిపెడతానని ట్వీట్‌ చేసింది. ఇకనైనా ఈ అవాస్తవాన్ని దుష్ప్రచారం చేయకండి అని బ్యూటీ కోరింది. మరోవైపు హజారికా కూడా మేము పెళ్లి చేసుకోలేదని దయచేసి ఇలాంటి వదంతులు ఆపాలని శాంతను హజారికా కూడా పోస్ట్ చేశాడు.

సినిమాల విషయానికొస్తే.. తనదైన శైలిలో నటిస్తూ టాలీవుడ్‌లో శృతి హాసన్ స్టార్ హీరోయిన్‌ పేరుగావించింది. ఆ మధ్య వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నా టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌తో దూసుకుపోతుంది. 2023లో తెలుగులో వరుస సక్సెస్‌లను అందుకుంది శృతి హాసన్‌. సంక్రాంతికి విడుదలైన చిరంజీవి వాల్తేర్ వీరయ్య , బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను సంపాదించుకుంది. రీసెంట్ గా సలార్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని.. గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. ఈ ఏడాది శృతి హాసన్ చేసిన సినిమాలు వెయ్యి కోట్ల రూపాయిల బిజినెస్ ని బాక్స్ ఆఫీస్ వద్ద చేసినట్టు అయ్యింది. ఇలాంటి రికార్డు సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ ఖాతాలో కూడా లేదు. గత రెండు మూడేళ్ళ నుండి శృతి హాసన్ పట్టిందల్లా బంగారం లాగ మారుతూ వస్తుంది. ఆమె గోల్డెన్ లెగ్ ప్రభావం ఉన్నప్పుడే తమ సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు మేకర్స్.