1000 కోట్ల సునామీ… ప్రభాస్ కోసం 500 కోట్ల ఖరీదైన పెన్ను…

రెబల్ స్టార్ ఎప్పుడు ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేనంతగా, తన స్ట్రాటజీ ప్రతీ సారి షాక్ ఇస్తోంది. 1000 కోట్లని ఇండియన్ మార్కెట్ కి వెరీ వెరీ కామన్ గా మార్చిన ప్రభాస్ కోసం, దర్శక నిర్మాతలు పూనకాలొచ్చేలా భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు.

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 08:31 PM IST

రెబల్ స్టార్ ఎప్పుడు ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేనంతగా, తన స్ట్రాటజీ ప్రతీ సారి షాక్ ఇస్తోంది. 1000 కోట్లని ఇండియన్ మార్కెట్ కి వెరీ వెరీ కామన్ గా మార్చిన ప్రభాస్ కోసం, దర్శక నిర్మాతలు పూనకాలొచ్చేలా భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, కల్కీ 2 అలానే స్పిరిట్ కాకుండా మరో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా కోసంమే కాంతారా ఫేం రక్షిత్ శెట్టి ని రంగంలోకి దింపుతున్నారా? ఒకవైపు బాహుబలి లాంటి భారీ కటౌట్… మరో వైపు 15 కోట్లతోనే 500 కోట్లు రాబట్టిన కాంటారా కటౌట్.. ఈ ఇద్దిరినీ కేజీయఫ్ లాంటి సెన్సేషన్స్ ని క్రియేట్ చేసిన హంబలే బ్యాచ్ కలిపేస్తోంది.. ఇంతకి 500 కోట్ల ఖరీదైన పెన్ను సంగతేంటి? దానికి రెబల్ స్టార్ కొత్త సినిమాకున్న లింకేంటి?

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో 1850 కోట్ల బాహుబలి రికార్డుని ఇంతవరకు ఎవరూ టచ్ చేయలేదు. ఇక కల్కీ 1200 కోట్లు రాబడితే, సలార్ 750 కోట్లతో దుమ్ముదులిపింది. ఇలా కెరీర్ లో ఆల్ మోస్ట్ 5 పాన్ ఇండియా హిట్లతో మొత్తంగా 5 వేల కోట్ల వసూళ్లకి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు ప్రభాస్.

అలాంటి స్టార్ తో ఆల్రెడీ 1000 కోట్ల బడ్జెట్ పెట్టి స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ 400 కోట్ల ఖర్చుతో ది రాజా సాబ్, 500 కోట్ల బడ్జెట్ తో ఫౌజీ తెరకెక్కుతోంది. సలార్2, కల్కీ 2 వచ్చే ఏడాది పట్టాలెక్కే చాన్స్ఉంది..

ఇలాంటి టైంలో 1000 కోట్ల బడ్జెట్ తో భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసింది కేజీయఫ్ తో పాపులరైన హంబలే సంస్థ… అందుకోసం 500 కోట్ల ఖరీదైన పెన్నుని వాడబోతోంది. ఇదే సంస్థతో టై అప్ అయిన కాంటారా ఫేం రిషబ్ షెట్టీని రంగంలోకి దింపుతున్నారు హంబలే బ్యాచ్ మెంబర్స్

ఆల్రెడీ కాంతారా2 పనుల్లో బిజీ అయిన రిషబ్ శెట్టి, హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఇలా చేతిలో రెండు ప్రాజెక్టులు అంటే వెయ్యికోట్ల బిజినెస్ పెట్టుకుని బిజీ అవుతున్నాడు. ఇలాంటి టైంలో రెబల్ స్టార్ ప్రభాస్ కోసం రిషబ్ శెట్టి పన్ ని గన్ లా వాడే ప్రయత్నం మొదలైంది. హంబలే సంస్త నిర్ణయంతో ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది

రిషబ్ శెట్టి డైరెక్షన్ చేస్తాడా? లేదంటే తను రాసిన కథని, హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మ తీస్తాడా ఇంకా డిసైడ్ కాలేదు. అంతా ప్రభాస్ తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. వన్స్ రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంతారాతో 500 కోట్లు రాబట్టిన రిషబ్ శెట్టి, హనుమాన్ తో 500 కోట్లు రాబట్టిన ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రభాస్, హంబలే మూవీ పట్టాలేక్కడం ఆల్ మోస్ట్ ఖాయం అని తెలుస్తోంది.