Pushpa2 : సుకుమార్ ఏడిపించేస్తాడట భయ్యా..!

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ పాన్ ఇండియా (Pan India) మూవీ పుష్ప 2.. సుకుమార్ (Sukumar) డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ మూవీ కోసం ఇండియా వైడ్ బ‌న్నీ ల‌వ‌ర్స్ ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

 

 

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ పాన్ ఇండియా (Pan India) మూవీ పుష్ప 2.. సుకుమార్ (Sukumar) డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ మూవీ కోసం ఇండియా వైడ్ బ‌న్నీ ల‌వ‌ర్స్ ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్‌-1 కు ముందు వ‌ర‌కు టాలీవుడ్‌ (Tollywood) కే ప‌రిమిత‌మైన స్టైలిష్ స్టార్.. పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించాడు. త‌న స్టైల్‌, స్వాగ్‌, మేన‌రిజ‌మ్‌ల‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. బ‌న్నీ స్టైల్‌, డాన్స్ మూమెంట్స్‌ను వ‌ర‌ల్డ్ సెల‌బ్రిటీలు వీడియోలు చేశారంటే అల్లు అర్జున్ మానియా ఏ రేంజ్‌లో అఫెక్ట్ చూపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ మానియాకు తగ్గట్లుగానే సుకుమార్‌ కూడా పార్ట్‌ 1కు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పుష్ప-2 పాన్ ఇండియా లెవెల్‌లో ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ టైమ్‌లో ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఈ మూవీపై మరింత హైప్‌ను పెంచేస్తోంది.

అమ్మ సెంటిమెంట్, పుష్ప లవ్ ట్రాక్ కానీ అలాగే పుష్ప ఫ్లాష్ బ్యాక్ పుష్ప 1కు ప్రాణం పోసాయని చెప్పాలి.. దీనికి తగ్గట్లుగానే పుష్ప-2లో కూడా సాలిడ్ ఎమోషన్స్ ఉన్నాయట.. ఇక “పుష్ప పార్ట్ 2” మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యం లో ఈ సినిమా లో ఎమోషన్ డోస్ మరింత పెంచేందుకు సుకుమార్ ప్లాన్ చేశాడట.. అందులో భాగంగా పార్ట్-2 ఫ్రెండ్‌ షిప్‌కు సంబంధించి కూడా ఎమోషనల్‌ ట్రాక్‌ను మరింత బలంగా యాడ్ చేయబోతున్నాడట.. పార్ట్‌-1లో పుష్ప, కేశవ మధ్య సన్నివేశాలు చాలా ఫ్రెండ్లీగా, జోవియల్‌గా నడిస్తే.. పార్ట్‌-2లో మాత్రం చాలా అమోషనల్‌గా నడుస్తాయని తెలుస్తోంది.

“పుష్ప పార్ట్ 2” లో ఫ్రెండ్షిప్ కు సంబంధించిన ఎమోషన్ బలంగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. అందులో భాగంగా అల్లు అర్జున్ పాత్రకు కేశవ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచే విధంగా సుకుమార్ చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సాలిడ్ అమోషన్‌లో ట్రాక్‌ మూవీకే హైలెట్‌గా నిలవడం ఖాయమంటున్నారు. మొత్తానికి లెక్కల మాస్టారు. పుష్ఫ-2 ను అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నారని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.