అదే శిష్యరికం. రాజమౌళి అంతా పెద్ద దర్శకుడు కాని తన శిష్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దర్శకుడిగా ఫోకస్ కాలేదు. పెద్ద హిట్ కొట్టలేదు.అదే సుకుమార్ శిష్యులని చూస్తే ఆలెక్కే వేరు. దసరాతో శ్రీకాంత్ ఒదేలా పాన్ ఇండియా హిట్ కొడితే, ఉప్పెనతో వందకోట్ల హిట్ మెట్టెక్కాడు బుచ్చి బాబు. ఇప్పుడు రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశాడు. ఇక గతలో కుమారి 21 ఎఫ్, 18 పేజెస్ తో సూర్యప్రతాప్ తన ప్రతాపం చూపిస్తే, విరూపాక్షతో మరో శిష్యుడు కార్తిక్ కిక్ ఇవ్వబోతున్నాడు
సో సుకుమార్ ఓ డైరెక్టర్ల ఫ్యాక్టరీ గా మారటంతో, తన శిష్యులతో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ అన్న బ్రాండ్ క్రియేట్ అయ్యింది. కాని రాజమౌళి దగ్గర దర్శకత్వంలో శిక్షణ తీసుకున్న తన తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా ఆరూట్లో హిట్ మెట్టెక్కలేకపోయాడు. రాజన్న ఫ్లాప్ తోడీలా పడ్డాడు. సో ఈ విషయంలో సుకుమార్ తో పోలిస్తే రాజమౌళి ఎక్కడో అధ: పాతాళంలో ఉన్నాడు.