పుష్ప మూవీతో బన్నీకి ఎంత పేరొచ్చిందో, డైరెక్టర్ గాసుకుమార్ కి అంతే ఇమేజ్ దక్కింది. ఇక పుష్ప2 తో ఏకంగా రాజమౌళినే మించిన సుకుమార్ అంటున్నారు. ఇంత జరిగితే, తను గాల్లో తేలాలి.. లేదంటే పండగ చేసుకోవాలి… అలా కాకుండా సినీ సన్యాసం తీసుకుంటానన్నాడు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ లోసినిమాలాపేస్తా అన్నాడు. ఆ మాటే సోషల్ మీడియాలో వైరలైంది. అంతా సరదాగా అన్నాడనుకున్నారు. కాని నిదానంగా ఒక్కో మ్యాటర్ బయటికొస్తోంది.. పుష్పరాజ్ ఘనకార్యమే సుకుమార్ కి విరక్తి కలిగించిందని తెలుస్తోంది. ఐతే ఇదేదో సంధ్యా థియేటర్ ఇష్యూ వల్లో, పుష్ప 2 టీం ని కేసు వెంటాడం వల్లో కాదు… అంతకుమించిన రీజనే ఉందట. ఏడాదిగా సుకుమార్ కు సినిమాల మీద ఆసక్తి తగ్గటానికి కోటి కారణాలున్నట్టు చెబుతున్నారు. అంతా బానే ఉంది.. సుకుమార్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడంటే తనకుండే వర్షణ్ తనకుండే ఛాన్స్ ఉంది.. కాని ఏడాది నుంచి ఇలా అనిపిస్తోందన్న స్టేట్ మెంటే పుష్పరాజ్ కి పంచ్ ఇచ్చేలా ఉంది.. ఇంతకీ ఈ స్టేట్ మెంట్ వెనకున్న లాజిక్ ఏంటి?
డైరెక్టర్ సుకుమార్ కల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. సందీప్ రెడ్డి వంగ అంత కాదు కాని, అలాంటి కల్ట్ మేకింగ్ ని ఈ తరానికి అందించిన డైరెక్టర్ కూడా. బేసిగ్గా లెక్కల మాస్టరైన తను, నిజంగా టీచింగ్ ఫీల్డ్ లో ఉంటే రిటైర్ అయ్యేవాడె, కాదో కాని, రిటైర్మెంట్ అవసరం లేని సినిమాలకు మాత్రం గుడ్ బై అన్నాడు
ఏదో సరదాగ అన్న మాటే.. కాని ఆ మాట వెనక తన ఆవేదన ఇప్పుడిప్పుడే లీకౌతోంది. పుష్పీ2 కేసు, తర్వాత పరిణామాలతో సుకుమార్ ఇలా మాట్లాడుతున్నాడా అంటే, కానేకాదు… అసలు సంధ్యా థియేటర్ ఎపిసోడ్ కి, సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టు సుకుమార్ అన్న మాటకి సంబంధమే లేదు
యూఎస్ లో గేమ్ ఛేంజర్ ప్రమోషన్ లో భాగంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే, గెస్ట్ గా సుకుమార్ వచ్చాడు. మాటలో మాటగా, డోప్ తో మీరేం వదిలేస్తారనగానే సినిమా వదిలేస్తానన్నాడు. కాని ఇలా ఏడాదిగా సుకుమార్ టెన్షన్ పెడుతూనే ఉన్నాడని చరణ్ అనేశాడు. అలా సుకుమార్ రిటైర్మెంట్ ఆలోచన తప్పని తేల్చాడు
అయితే నిన్న, మొన్నటి వరకు ఇదేదో సరదాగ జరిగిన కన్వర్జేషన్ అనుకున్నారు. కాని ఇప్పుడిప్పుడే పుష్ప 2 తాలూకు సుకుమార్ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అసలు పుష్ప2 మూవీనే తన కెరీర్ లో అత్యంత వరస్ట్ మూవీ అన్నాడట సుకుమార్. అంతేకాదు బన్నీ వ్యవహార శైలి వల్ల కూడా తను ఇబ్బంది పడినట్టు బయట టాక్ షాక్ ఇస్తోంది
ఆర్య, ఆర్య 2 ఇలా బన్నీ కెరీర్ లోనే కాదు సుకుమార్ కెరీర్ కూడా టర్న్ అయ్యింది. ఈ ఇద్దరి జర్నీ అంత గొప్పగా సాగింది. అసలు బన్నీని స్టైలిష్ స్టార్ గా మార్చింది సుకుమారే. ఐకాన్ స్టార్ గా ప్రమోట్ చేసింది సుకుమారే… ఐతే అంతవరకు బానే ఉన్నా పుష్ప2 వరకొచ్చేసరికి ఈఇద్దరి మధ్య పెద్ద యుధ్దమే జరిగిందట. పుష్ప 2 హిట్టై వసూల్లు వస్తుంటే బయటికి మ్యాటర్ లీక్ కాలేదు కాని, సుకుమార్ స్టేమ్ మెంట్ వచ్చాకే, చాలా ప్రచారాలు నిజమనేలా టాక్ షురూ అయ్యింది
నిజానికి పుష్ప2 మూవీ ముందుగా రాసిన కథ వేరు… కాని బన్నీనే నార్త్ ఆడియన్స్ కోసం కాంతారాస్టైల్లో అవసరం లేకున్నా శారి లుక్ లో ఫైట్ ని పెట్టాలని పట్టుపట్టాడట. అంతేకాదు సునీల్, అండ్ కో పాత్రలకు సీన్ కూడా తగ్గించేలా సుకుమార్ మీద ప్రెజర్ పెంచటంతో, పుష్ప2 ముందనుకున్ కథలో 60శాతం మార్చాల్సి వచ్చిందని తెలుస్తోంది. అందుకే ఆమధ్య వదిలిన గ్లింప్స్ లో బన్నీని వెతుకుతున్న పోలీసులు, శేషాచలం అడవిలో తిరుగుతున్న పుష్పరాజ్ లాంటి కంటెంటే పుష్ప 2 లో కనిపించలేదు
ఏదేమైనా సుకుమార్ మంచి రైటర్.. కాని బన్నీ కోసమే పుష్ప 2 లో చాలా ఇంపార్టెంట్ పాత్రలను కత్తిరించటమే కాదు, సెకండ్ హాఫ్ లాజిక్ లేకుండా సోది సీన్లతో నింపాల్సి వచ్చిందని బాధపడ్డాడట. ఈ విషయంలో ఓసారి క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి, బన్నీకి నెలరోజులు దూరంగా ఉన్నాడు సుకుమార్. ఆ వన్ మంథ్ గ్యాప్ వెనకున్న స్టోరీ ఇదే అనంటున్నారు.ఏదేమైాన పుష్ప హిట్ తర్వాత బన్నీకి ఇమేజ్ పిచ్చి పట్టుకుందని, క్రికెటర్లు సైతం తన డైలాగ్స్ చెబుతుండటంతో, తనని తాను ఎక్కువ ఊహించుకున్నాడని అంటున్నారు. ఫలితంగానే, పుష్ప2 తో తానే హైలెట్ అయ్యేలా కథని తనకు అనుకూలంగా రాయించుకుని, పుష్ప2 సెకండ్ హాఫ్ ని అడ్రస్ లేకుండా చేశారనే కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు సుకుమార్ స్టేట్ మెంట్ తో నిజంగానే పుష్ప2 విషయంలో సుకుమార్ విరక్తి చెందే ఇలా మాట్లాడాడనంటున్నారు.