Sukumar : సుకుమార్ శిష్యులా మజాకా

టాలీవుడ్ (Tollywood) లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే గుర్తుకొచ్చే పేరు సుకుమార్ (Sukumar). లాజిక్స్ తో మ్యాజిక్ చేసే ఈ జీనియస్ డైరెక్టర్.. 'పుష్ప' (Pushpa) సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

 

 

టాలీవుడ్ (Tollywood) లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే గుర్తుకొచ్చే పేరు సుకుమార్ (Sukumar). లాజిక్స్ తో మ్యాజిక్ చేసే ఈ జీనియస్ డైరెక్టర్.. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఇండియన్ టాప్ స్టార్స్ సైతం ఆసక్తి చూపిస్తారు అనడంలో సందేహం లేదు. అయితే సుకుమార్ మాత్రమే కాదు.. ఆయన శిష్యులు సైతం సినీ పరిశ్రమలో దర్శకులుగా సత్తా చాటుతున్నారు.

ఇతర టాప్ డైరెక్టర్ల అసిస్టెంట్స్ తో పోలిస్తే.. సుకుమార్ (Sukumar) అసిస్టెంట్స్ టాలీవుడ్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. ‘కరెంట్’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన పల్నాటి సూర్యప్రతాప్.. ‘కుమారి 21ఎఫ్’,(Kumari 21F) ’18 పేజెస్’ (18 Pages) వంటి చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘ఉప్పెన’ వంటి ఘన విజయంతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు.. దర్శకుడిగా తన రెండో సినిమాని ఏకంగా రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ‘దసరా’తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, హీరో నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.. తన రెండో సినిమాని కూడా నానితోనే చేస్తున్నాడు. ‘భమ్ బోలేనాథ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కార్తీక్ దండు.. ‘విరూపాక్ష’తో ఒక్కసారిగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని నాగ చైతన్యతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇలా ఎందరో సుకుమార్ శిష్యులు దర్శకులుగా తమ మార్క్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో అర్జున్ వై.కె అనే మరో దర్శకుడు చేరాడు. ఈయన సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’కి దర్శకత్వం వహించాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి.. తమ సత్తా చాటుతున్నారు