డైరెక్టర్ సుకుమార్ ఎంత గొప్పగా సినిమాలో తీస్తాడో జీవితంలో కూడా అంతే గొప్పగా ఆలోచిస్తాడు. అంతే గొప్పగా బ్రతుకుతుంటాడు కూడా. అందుకే ఆయనపై ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీ రాదు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో తన అసిస్టెంట్లను డైరెక్టర్లగా మార్చి సినిమాలు తీసిన చరిత్ర అయనది. తన దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన వాళ్లను సపోర్ట్ చేశాడు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ తన ఇంట్లో పని చేసే పనిమనిషిని కూడా చదివించి ఇప్పుడు గర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేశాడు అంటే.. ఇది చిన్న విషయం కాదు. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో దివ్య అనే అమ్మాయి చాలా కాలంగా పని చేస్తుంది. ఒక పక్క హెల్పర్ గా పనిచేస్తూనే చదువు మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్‌ను సుకుమార్ దంపతులు గ్రహించారు. ఆమెను విధాలా ప్రోత్సహించారు.
ఆ దంపతుల అండతో బాగా చదువుకున్న దివ్య ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. ఆ ఆనందాన్ని సుకుమార్ భార్య తబిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తమ ముందే రెక్కలు విప్పుకుంటూ ఇలా ఉన్నత స్థాయికి వెళ్లిన దివ్యను చూసి సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న సుకుమార్ అభిమానులు, నెటిజన్స్ దివ్యను, సుకుమార్ దంపతులను పొగుడుతున్నారు. సుకుమార్ ఫ్యామిలీలా సాయం చేసే వారి వల్ల ఎంతో మంది చిన్న స్థాయి నుంచి పైకి ఎదగగలుగుతున్నారంటూ అభినందనలు తెలుపుతున్నారు. గతంలో లెక్కలు మాస్టారుగా పని చేసిన సమయంలోనూ చాలా మంది పేద విద్యార్థులను ప్రోత్సహించాడు సుకుమార్. డైరెక్టర్‌గా ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన ఇప్పటికీ ఆ లక్షణాన్ని కోల్పోలేదని సుక్కు ఫ్యాన్స్ గర్వంగా పోస్ట్‌లు పెడుతున్నారు.