Rajinikanth: కొందరు ట్రెండ్ సెట్ చేస్తే.. మరికొందరు ఫాలో అవుతారు. రజనీకాంత్ ట్రెండ్ ఫాలో అవుతూ రిస్క్ చేస్తున్నాడు. జైలర్ మూవీలో వయసుకు తగ్గ క్యారెక్టర్ పోషించినా.. రిస్క్ చేశాడు. మరోసారి ఇలాంటి సాహసమే చేస్తున్నాడు ఎందుకు..? జైలర్ రాకముందు రజనీకాంత్‌పై ఎన్నో విమర్శలు. ఎన్నో సెటైర్స్. సూపర్‌స్టార్ మూవీకి తెలుగులో రూ.10 కోట్లు కూడా రాని పరిస్తితి. అందుకే జైలర్ సినిమాను రూ.12 కోట్లకు అమ్మితే.. ఎవరూ ఊహించనవిధంగా రూ.48 కోట్లు వచ్చింది.
జైలర్ మూవీతో రజినీ విమర్శకులకు సమాధానం చెప్పడమే కాదు.. తనకు సూపర్‌హిట్ హిట్ పడితే ఎలా వుంటుందో చూపించాడు. యాక్షన్ కొత్త కాకపోయినా.. ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ.. 70 ప్లస్‌లోనూ భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు రజనీ. జైలర్ మూవీ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా వచ్చింది. మరోసారి ఇంతకుమించిన యాక్షన్ చేయబోతున్నాడు రజనీ. వయసు రీత్యా నించున్న చోటే ఫైట్ చేసినా ఈ వయసులో రిస్కే అంటున్నారు అభిమానులు. ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాల్లోకి వెళ్లని రజనీ.. ఈ వయసులో ఈ యాక్షన్ మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో లోకేష్ కనగరాజ్ మూవీలో నటించనున్న రజినీ.. అందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడు. ఇది రజినీకి రిస్కే అయినా.. లోకేష్ డైరెక్టర్ కావడంతో మరోవైపు ఫ్యాన్స్ ఖుషీ ఫీలవుతున్నారు. రజినీ నటించే 171వ సినిమాను లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో, జైలర్ తీసిన సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
లోకేశ్ విజయ్‌తో తీసిన ‘లియో’ అక్టోబర్ 19న విడుదలవుతోంది. లోకేశ్, రజనీ మూవీ ‘సినిమాటిక్ యూనివర్స్’ కథగా వస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకరకంగా మల్టీవర్స్ తరహాలోనే సినిమా వుంటుందట. లియో సినిమాలో కూడా విక్రమ్, ఖైదీ సినిమాకు సంబంధించిన పాయింట్స్ ఉండబోతున్నట్లు సమాచారం. రజనీకాంత్ 171వ కథకు కూడా పాత క్యారెక్టర్స్‌తో లింక్ అయ్యేలా దర్శకుడు రెడీ చేస్తాడట. సినిమాను 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి దీపావళికి రిలీజ్ చేస్తారు. ఈలోగా రజనీ జై భీమ్ ఫేం జ్ఞానవేల్ మూవీ పూర్తి చేయాల్సి ఉంది.