మాస్‌ మిండెడు… ఇదేం అరాచకం దేవర..

ఓ బాహుబలి, ఓ కేజీఎఫ్‌, ఓ సలార్‌.. అన్నింటిని మిక్సీలో వేసి తీస్తే.. దేవర. కథ అలానే అనిపించింది.. ట్రైలర్ అలానే కనిపించింది. ధైర్యం తప్ప భయం తెలియని కళ్లకు.. భయం పొరలు కమ్ముకున్నాయని ప్రకాశ్ రాజ్‌ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్‌ అవుతుంది. 2 నిమిషాల 39 సెకన్లు.. స్క్రీన్ అంతా విధ్వంసమే.

  • Written By:
  • Publish Date - September 10, 2024 / 06:54 PM IST

ఓ బాహుబలి, ఓ కేజీఎఫ్‌, ఓ సలార్‌.. అన్నింటిని మిక్సీలో వేసి తీస్తే.. దేవర. కథ అలానే అనిపించింది.. ట్రైలర్ అలానే కనిపించింది. ధైర్యం తప్ప భయం తెలియని కళ్లకు.. భయం పొరలు కమ్ముకున్నాయని ప్రకాశ్ రాజ్‌ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్‌ అవుతుంది. 2 నిమిషాల 39 సెకన్లు.. స్క్రీన్ అంతా విధ్వంసమే. మాస్ అరాచకానికి స్పెల్లింగ్ రాయించాడు కొరటాల శివ. కత్తులు.. కలిసిన చేతులు.. అంటుకున్న రక్తాలు.. ఎన్టీఆర్‌ నుంచి ఎలాంటి మాస్‌ కావాలి అనుకుంటున్నారో.. అలాంటి మూవీనే కన్ఫార్మ్‌గా వస్తుందని క్లియర్‌గా అర్థం అయింది. విశ్వక్‌సేన్ అన్నట్లు.. మాస్ అమ్మ మొగుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఎన్టీఆర్‌ దేవరలో.

ఇలాంటి పాత్రలు తనకు లెక్కేకాదు అన్నట్లు.. నట విశ్వరూపం చూపించాడు. హై వోల్జేజ్ సీక్వెన్సుల్లో అదరగొట్టాడు. సముద్రం బ్యాక్‍డ్రాప్‌ విజువల్స్‌ అయితే కేక పుట్టించాయ్‌. అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఇంటెన్సిటీతో ఉంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సోలో హీరోగా వస్తున్నాడు. దీంతో దేవర మీద అంచనాలు ఆకాశానికి చేరిపోయాయ్‌. ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో పెట్టుకోండి.. తగ్గేదే లే లెవల్‌లో.. ట్రైలర్ కట్‌ చేశాడు డైరెక్టర్‌ కొరటాల. ట్రైలర్‌తోనే స్టోరీ క్లియర్‌గా చెప్పేశాడు. గ్రామాన్ని దోచుకునే ముఠా.. ఆ ముఠా నుంచి కాపాడే హీరో ఎన్టీఆర్‌.. ఆ లీడర్ స్థానం కోసం కుట్రలు చేసే విలన్‌.. సైఫ్‌ అలీఖాన్‌. స్టోరీ ఇంతే.. డ్రామా ఎలా ఉండబోతుందన్నది స్క్రీన్‌ప్లేతోనే చెప్పాలి.

ఇక పెద్ద ఎన్టీఆర్ పాత్రలో రౌద్రాన్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించాడో.. భయస్థుడిగా చిన్న ఎన్టీఆర్ పాత్రలో అంతే అదుర్స్ అనిపించాడు తారక్‌. ట్రైలర్‌లో హీరోయిన్ జాన్వీకి పెద్ద స్కోప్‌ లేదు. ఐతే ట్రైలర్‌ గ్రిప్పింగ్‌గా కట్ చేశారు. మూవీ మీద క్యూరియాసిటీ పెంచేసింది. ఐతే అక్కడక్కడ పెద్ద సినిమాల వాసనలు కనిపిస్తున్నాయ్. ప్రకాశ్ డబ్బింగ్‌ వింటే కేజీఎఫ్ చూసినట్లు అనిపిస్తే.. కొన్ని సీన్లు బాహుబలిని గుర్తు చేశాయ్‌. భయం అనే కాన్సెప్ట్.. టాలీవుడ్‌లో రిస్కీ కాన్సెప్ట్‌. అందుకే చాలామంది దానికి భయపడతారు. మరి తారక్ ఆ భయాన్ని భయపెడతాడా.. భయపడతాడా.. చూడాలి. ఇదంతా ఎలా ఉన్నా.. యావత్ ఇండియాను ఆల్రెడీ దేవర ఫీవర్ కమ్మేసింది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, మూడు పాటలు సినీ లవర్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మూవీ దేవర. ఇప్పుడు ట్రైలర్ ఆ క్యూరియాసిటీ మరింత పెంచింది.