Super Star: మరో రికార్డ్ బ్రేక్ చేసిన మహేష్..ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క హీరో

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు. చేసేది టాలీవుడ్ సినిమాలే అయినా మహేష్ రేంజ్ మాత్రం వరల్డ్ వైడ్ ఉంది.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 02:00 AM IST

ఇక మహేష్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగ వస్తున్నట్టే. ప్రస్తుతం మహేష్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ కు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మహేష్ కు ట్విట్టర్ లో విప్పతీతమైన ఫాలోయింగ్ ఉంది. మహేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన తన సినిమా విషయాలతో పాటు.. ఇతరుల సినిమాల కు సంబంధించిన విషయాలను. ప్రముఖలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో మహేష్ బాబు సూపర్ రికార్డ్ ను క్రియేట్ చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో మహేష్ 10 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఈ మూడు ఫ్లాట్ ఫామ్స్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరోగా మహేష్ బాబు రికార్డు క్రియేట్ చేశాడు.