Super Star: చేతిలో సిగరెట్‌తో మహేష్‌.. పోకిరీ డేస్‌ గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న SSMB28 గురించి సూపర్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మూవీ యూనిట్‌. సినిమా రిలీజ్‌ డేట్‌ రివీల్‌ చేస్తూ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 04:00 PM IST

2024 జనవరి 13న సినిమాను రిలీజ్‌ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్‌లో మహేష్‌ మాస్‌ లుక్‌లో సిగరెట్‌ తాగుతూ కనిపించాడు. దీంతో ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. ఎందుకంటే మహేష్‌ బాబు సిగరెట్‌ తాగడం మానేసి చాలా ఏళ్లైంది. సినిమాల్లో కూడా సిగరెట్‌ తాగే సీన్స్‌ చేసేవాడు కాదు. మహేష్‌ సిగరెట్‌ తాగుతూ కనిపించి లాస్ట్ సినిమా అతిథి. అప్పటి నుంచి మళ్లీ మహేష్‌ సిగరెట్‌ ముట్టుకోలేదు. నిజానికి ఒకప్పుడు మహేష్‌ బాబు చైన్‌ స్మోకర్‌. సినిమాల్లోనే కాదు బయట కూడా తెగ సిగరెట్లు తాగేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో సిగరెట్‌ తాగడం మానేశాడు.

ఈ విషయాన్ని చాలా ఫంక్షన్స్‌లో చెప్పాడు మహేష్‌. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత సిగరెట్‌తో దర్శనమిచ్చాడు. దీంతో ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. పోకిరీ సినిమా రోజులు గుర్తొస్తున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న SSMB28 షూటింగ్‌ ఫాస్ట్‌గా జరుగుతోంది. ఇప్పుడు రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో మహేష్‌ ఓ మిర్చి యార్డ్‌ సిగరెట్‌ తాగుతూ నడుచుకుంటూ వస్తున్నారు. పక్కనే విలన్‌ బ్యాచ్‌ మహేష్‌ వంక భయంగా చూస్తున్నారు. చూస్తుంటే అదేదో ఫైట్‌ సీన్‌లా కనిపిస్తోంది. మిర్చియార్డ్‌లో సిగరెట్‌ తాగుతున్నాడు అంటే సినిమా ఘాటు ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోందంటూ ఫ్యాన్స్‌ పోస్టర్‌ను వైరల్‌ చేస్తున్నారు.