జైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతవరకు ఏ పాన్ ఇండియా మూవీ కూడా ఈ రికార్డ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ క్రియేట్ చేసిన ఆ సరికొత్త రికార్డ్ సృష్టించింది. జైలర్ రిలీజై మూడో వారాలు కావస్తున్నా.. ఇప్పటికీ మంచి వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. జైలర్ తెలుగులో 16 రోజుల్లో 43 కోట్ల షేర్ 74 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకో వారంలో 50 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని అంచనా. జైలర్ తెలుగునే కాదు.. రిలీజైన ప్రతి భాషలో 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
జైలర్ హిందీలో రిలీజ్ కాకపోయినా.. సౌత్‌లోని నాలుగు భాషల్లోనూ విడుదలైంది. ఒక్కో భాషలో 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళనాడు.. కర్నాటక, కేరళలో ఈ ఘనత సాధించింది. ఇప్పటివరకు సీక్వెల్స్ మూవీస్ బాహుబలి2.. కెజిఎఫ్2 మాత్రమే ఆ రికార్డ్ సొంతం చేసుకోగా.. నాన్ సీక్వెల్స్‌లో నాలుగు భాషల్లో 50 కోట్ల మార్క్ దాటడం జైలర్‌తో మొదలైంది.
జైలర్ రిలీజైన 16 రోజుల్లో తెలుగులో 74 కోట్లు.. కర్నాటకలో 64.. కేరళలో 50 .. తమిళనాడులో 162 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా వరల్డ్ వైడ్ 122 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే.. ఇప్పటివరు 267 కోట్ల షేర్.. 547 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకో వారంలో.. 600 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా.