Mahesh : మొదటిసారి గడ్డంతో మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా 28 సినిమాల్లో హీరోగా నటించాడు. దాదాపు అన్ని సినిమాల్లోనూ క్లీన్ షేవ్ తోనే కనిపించాడు.

 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా 28 సినిమాల్లో హీరోగా నటించాడు. దాదాపు అన్ని సినిమాల్లోనూ క్లీన్ షేవ్ తోనే కనిపించాడు. మహేష్ ని మీసకట్టు, గడ్డం లుక్ లో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరనుంది.

మహేష్ తన నెక్స్ట్ మూవీని ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని.. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న లాంచ్ అయ్యే అవకాశముంది.

ఈ మూవీలో మహేష్ ని రాజమౌళి సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నాడట. పొడవాటి జుట్టు, మీసకట్టు, గుబురు గడ్డంతో మహేష్ లుక్ అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయం అంటున్నారు. దానికి టీజర్ అన్నట్టుగా తాజాగా మహేష్ న్యూ లుక్ లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కాడు. లాంగ్ హెయిర్, మీసం, గడ్డంతో ఆయన లుక్ అదిరిపోయింది. ఇక సినిమాలో మహేష్ లుక్ దీనిని మించి ఉండబోతుందని చెబుతున్నారు.