Mahesh Babu: సిక్స్ ప్యాక్స్ తో మహేశ్, ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్రివిక్రమ్ కి బ్యాడ్ న్యూస్..

మహేశ్ బాబు అప్పట్లో వన్ నేనొక్కడినేలో సిక్స్ ప్యాక్స్ లో కనిపిస్తాడన్నారు. జరగలేదు. తర్వాత సరిలేరు నీకెవ్వరు కోసం కసరత్తులు చేశాడు. అప్పుడూ కుదర్లేదు. కాని ఇప్పుడు షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్స్ తో తను కనిపించటం ఖాయమైంది. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, త్రివిక్రమ్ కి బ్యాడ్ న్యూస్.. ఎందుకు? టేకేలుక్

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 04:10 PM IST

మహేశ్ బాబు టాలీవుడ్ లో హాలీవుడ్ లుక్కున్న హీరో. కాని ఇంతవరకు సిక్స్ ప్యాక్స్ తో కనిపించలేదు. బన్నీ, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ అప్పట్లో పవన్ అంతా సిక్స్ ప్యాక్స్ తో షాక్ ఇచ్చారు. యంగ్ హీరోలు ఇంకా ఈ విషయంలో క్యూ కడుతున్నారు. కట్ చేస్తే ఇంతవరకు మహేశ్ బాబుని మాత్రం సిక్స్ ప్యాక్స్ లో చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కి కాని, ముఖ్యంగా ఫీమేల్ ఫ్యాన్స్ కి దక్కలేదు.

ఐతే ఇప్పుడది జరిగేలా ఉంది. మొన్న జిమ్ వర్కవుట్లతో మహేశ్ తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కి సర్ ప్రైజ్ ఇచ్చేలా ఉన్నాడు. అప్పట్లో ఖలేజా తీసినప్పుడే సిక్స్ ప్యాక్స్ ఐడియాను ఇచ్చాడట మాటల మాంత్రికుడు.. మహేశ్ కూడా ట్రై చేశాడు కాని, సిక్స్ ప్యాక్స్ షేప్ వచ్చే టైంలో సూపర్ స్టార్ కి హెల్త్ కండీషన్ సపోర్ట్ చేయకపోవటంతో కుదర్లేదు.

తర్వాత వన్ నేనొక్కడినే లో సిక్స్ ప్యాక్స్ ట్రై చేసినా, ఓ ఫైట్ సీన్ తీసినా ఎందుకనో దాన్ని సినిమాలో పెట్టలేదు. ఇప్పుడు సిక్స్ ప్యాక్స్ కి మహేశ్ ట్రై చేస్తున్నాడు. సో ఖలేజాతో మిస్ అయ్యింది గుంటూరు కారంతో సక్సెస్ అవుతుందనుకుంటే, ఇక్కడ త్రివిక్రమ్ కి మహేశ్ షాకే ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తన చేసే సిక్స్ ప్యాక్స్ వర్కవుట్లు గుంటూరు కారం కోసం కాదట,రాజమౌళి మూవీకోసమే అని తెలుస్తోంది. జక్కన్న నుంచి ఇన్ స్ట్రక్షన్స్ వెళ్లాయట. సిక్స్ ప్యాక్స్ లుక్ గుంటూరు కారంలో చూపించకూడదని, తన మూవీకి ఎక్స్ క్లూజివ్ సీన్స్ కోసం టాప్ లెస్ సీన్స్ చేయకూడదని రాజమౌళి కండీషన్స్ పెట్టాడని తెలుస్తోంది. సో త్రివిక్రమ్ మూవీకోసం సిక్స్ ప్యాక్స్ రెడీచేస్తే, రాజమౌళి సినిమాకే ఆ అద్రుష్టం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.