Guntur Karam : సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు దుమ్ము రేపాడు.. కుర్చీలు జాగ్ర‌త్త‌మ్మా..

సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు దుమ్ము రేపాడు.. గుంటూరు కారం ఘాటు ఎలా ఉంటాదో శాంపిల్ చూపించాడు.. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గుంటూరు కారం ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.. కాసేపటి క్రితమే విడుదలైన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ చేత ఈల‌లు వేయిస్తోంది.. ప్పటి వరకు ఎప్పుడూ చూడని మహేష్ బాబు ని ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపించినట్టుగా ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. మహేష్ మార్క్ కామెడీ టైమింగ్ తో పాటుగా, స్టైల్ మరియు స్వాగ్ కూడా కొత్తగా ఉంది.

సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు దుమ్ము రేపాడు.. గుంటూరు కారం ఘాటు ఎలా ఉంటాదో శాంపిల్ చూపించాడు. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గుంటూరు కారం ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.. కాసేపటి క్రితమే విడుదలైన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ చేత ఈల‌లు వేయిస్తోంది.. ప్పటి వరకు ఎప్పుడూ చూడని మహేష్ బాబు ని ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపించినట్టుగా ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. మహేష్ మార్క్ కామెడీ టైమింగ్ తో పాటుగా, స్టైల్ మరియు స్వాగ్ కూడా కొత్తగా ఉంది. దీనికి తోడు శ్రీలల అందాలు ట్రైల‌ర్‌కు మ‌రింత మ‌సాలా ఘాటును అందించాయి.

కథ రొటీన్ గా అనిపించినప్పటికీ టేకింగ్ మాత్రం అదరగొట్టేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డైలాగ్స్ కూడా బాగా పేలాయి.. మ‌హేశ్ బాబు.. అగ్గిపెట్టెతో బీడీ వెలిగించే స్టైల్ ని చూస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ గుర్తుకు వచ్చాడు. కాగా.. గుంటూరు కారం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇందులో మహేష్‌బాబు మాస్‌ లుక్‌కి అంతా ఫిదా అవుతున్నారు. పాన్ ఇండియా మూవీకి ముందు మహేష్ మాంచి మాస్ హిట్‌ను క‌న్‌ఫామ్ చేసుకున్న‌ట్లే అన్న టాక్ వినిపిస్తోంది. పూర్తిగా ఊర మాస్‌లుక్‌తో పాటు.. మాస్ డైలాగుల‌తో మ‌హేశ్ చేసిన ర‌చ్చ‌కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. కుర్చీ మడత పెట్టి పాట సినిమాలో ఇంకెంత దుమ్ము రేప‌నుందో అన్న అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో రమ్య కృష్ణ మహేష్ బాబు కి తల్లిగా, అలాగే ప్రకాష్ రాజ్ తండ్రిగా నటిస్తున్నారని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక టాక్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య కొన్ని విబేధాలు వచ్చి విడిపోతారని, క్లైమాక్స్ లో మళ్ళీ కలుస్తారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ట్రైలర్ చూస్తుంటే అలాగే ఉంది. సినిమా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, మాస్ ఆడియన్స్ కి కూడా ఫీస్ట్ గా ఉంటుందని ట్రైలర్ ని చూస్తేనే అర్థం అయిపోతుంది. మొత్తానికి ట్రైల‌ర్ అన్ని ర‌కాల ఎమోష‌న్స్‌తో.. అన్ని మసలాలు నూరి రంగరించి తాళింపు వేసి చేసిన సినిమాలా అనిపించింది. ఈ ట్రైల‌ర్ బాబు ఫ్యాన్స్ కి అదిరిపోయే ఫీస్ట్ అని చెప్పొచ్చు.