Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్లు పై బడినా నటనలో రికార్డులు సృష్టిస్తున్నాడు. కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నాడు. ఇప్పటికీ తన సినిమా కోసం ఎదురు చూడ్డంలో ఫ్యాన్స్ ఆనందం పొందుతున్నారంటే అది రజనీకాంత్ కి మాత్రమే ఘనత. ఇక.. జైలర్ మూవీతో రజనీ మళ్లీ గాడిలో పడ్డాడు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను కొల్లగొట్టిన ఈ మూవీతో మరోసారి రజనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది.
దీంతో తలైవా 171 మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కోసం రజనీ కళ్లు చెదిరే మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఏదైనా మూవీ గురించ పెద్ద చర్చ నడుస్తోందా అంటే అది తలైవర్ 171 గురించే అనాలి..ఆ టైటిల్ టీజర్ చూసిన తర్వాత రజినీకాంత్ ఫ్యాన్స్ నేల మీద నిలవడం లేదు. టీజర్ ఆ రేంజ్లో ఉంది మరి. లోకేశ్ కనకరాజుతో మూవీ అన్నప్పుడే స్కైహైని తాకిన అంచనాలు.. టీజర్ బయటకు వచ్చాక అంతకు మించి పెరిగిపోయాయి. టీజర్ చూసిన తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
ఇప్పుడు ఈ మూవీకి సంబధించి ఇంకో క్రేజీ వార్త వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రజినీకాంత్ ఏకంగా 260 కోట్ల నుంచి 280 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నారనే టాక్ ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వార్తే నిజమైతే ఆసియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా రజినీ అరుదైన రికార్డును సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. రజినీకాంత్- లోకేష్ కనకరాజు కాంబోలో కళానిధి మారన్ ఈ కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రజనీ జైలర్ మూవీని కూడా కళానిధి మారన్ నిర్మించారు. ఆ మూవీ భారీ లాభాలు తెచ్చి పెట్టినందుకు రజినీకాంత్ కు ఒక లగ్జరీ కారు, 100 కోట్ల వరకు అదనంగా ఇచ్చారని అప్పట్లో వార్తలు వినిపించాయి.. మూవీ టీమ్ మొత్తానికి బంగారు నాణేలు కూడా ఇచ్చారని టాక్.. ఇప్పుడు మళ్లీ రజినీతో కళానిధి మారన్ కూలీ చిత్రం చేస్తున్నారు.
ఈసారి సినిమా రెమ్యూనరేషనే నెక్ట్స్ లెవల్లో ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవి కేవలం గాసిప్స్ మాత్రమే. ఒకవేళ అదే గనుక నిజమైతే పాన్ ఇండియా లెవల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా రజనీ రికార్డు సృష్టించడం ఖాయం.. అయితే రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే.. కూలీ చిత్రం జైలర్ కి మించి సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.