Surender Reddy: ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి కోలుకున్నాడు. పవన్ కల్యాణ్ సినిమా ఓకె కావడంతో గాడిలో పడ్డాడనుకున్నారంతా. అయితే.. అక్కడే తప్పులో కాలేశాడా..? అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ కొత్త ప్రాజెక్ట్ ఓకె చేస్తే.. అభిమానులే పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ సెట్స్‌పై వున్న 3 సినిమాలు పూర్తి చేస్తే చాలంటున్నారు. మూడేళ్ల క్రితం స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు ఇంకా పూర్తికాలేదు. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ రెండేళ్లుగా నలుగుతూనే వుంది.
సుజీత్ దర్శకత్వంలో ఓజీ చేస్తున్నాడు. ఈ మూవీ కాస్త కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే.. రెండేళ్ల క్రితమే ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. సురేందర్ రెడ్డి ఏజెంట్‌కు ముందే పవన్‌కల్యాణ్‌తో సినిమా కమిటయ్యాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత పవన్ డెసిషన్ మార్చుకుంటాడనుకున్నారు. కానీ, పవన్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో నటించడానికి ముందుకొచ్చాడు. ఈ చిత్రానికి రామ్ తళ్లూరి నిర్మాత. ఈ మూవీ కోసం తీసుకున్న కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు కూడా ఈమధ్య నిర్వహించారు. పవన్ కొత్త సినిమా సైన్ చేసినా.. ప్యాన్స్‌కు కిక్ ఇవ్వడం లేదు.
చేతిలో వున్న 3 సినిమాలుపూర్తి చేసి రిలీజ్ చేస్తే.. అదే పదివేలన్న ఫీలింగ్‌లో వున్నారు. ఎప్పుడు డేట్స్ ఇస్తాడో.. ఎప్పుడు షూటింగ్ పూర్తిచేస్తారో తెలీదు. ఇలాంటి టైంలో సురేందర్ రెడ్డి.. పవన్‌ను నమ్ముకుంటే.. హరీశ్ శంకర్.. క్రిష్ మాదిరి సంవత్సరాలు వేస్ట్ చేసుకోవాల్సిందేనా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి.