SURIYA-KARTHI: సూర్య, కార్తీ ఉదారత.. తమిళనాడు తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం

తుఫాను ప్రభావిత ప్రజలకు సాయం చేసేందుకు సినీ హీరోలు సూర్య, కార్తి ముందుకొచ్చారు. వరద బాధితులను ఆదుకునే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. గతంలో కూడా సూర్య, కార్తీ పలుసార్లు ఇలాంటి సాయమే ప్రకటించారు.

  • Written By:
  • Updated On - December 5, 2023 / 03:52 PM IST

SURIYA-KARTHI: తమిళనాడు తీవ్ర తుఫాన్ బారిన పడిన సంగతి తెలిసిందే. చెన్నై సహా రాష్ట్రంలోని అనేక తీర ప్రాంతాలు మిగ్ జాం తుఫానులో చిక్కుకున్నాయి. దీంతో తమిళనాడులో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తుఫాను ప్రభావిత ప్రజలకు సాయం చేసేందుకు సినీ హీరోలు సూర్య, కార్తి ముందుకొచ్చారు. వరద బాధితులను ఆదుకునే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. గతంలో కూడా సూర్య, కార్తీ పలుసార్లు ఇలాంటి సాయమే ప్రకటించారు.

SALAAR: డార్లింగ్‌ ఎక్కువగా కనిపించడా.. సలార్‌లో ప్రభాస్‌ రోల్‌ తగ్గించారా..?

ఇక.. సూర్య తన ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. చెన్నైతోపాటు అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం నీట మునిగిపోయింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో రవాణా స్తంభించిపోయింది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం వరుస సెలవులు ప్రకటించింది. మరోవైపు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. బలమైన గాలుల ప్రభావానికి చెట్లు విరిగిపడుతున్నాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగి, నివాసాలు కొట్టుకుపోయాయి. చెన్నైలాంటి నగరాల్లో వరద నీటి ప్రభావానికి కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఎయిర్‌పోర్టులో విమానాలు ముగినిపోయేంతగా నీళ్లు చేరుకున్నాయి.

వరద ప్రభావంతో ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన జనం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి.