Kanguva: కంగువా రిలీజ్ డేట్ ఫిక్స్.. కమల్‌కు షాక్..

సీనియర్ హీరో కమల్ హాసన్‌‌కి స్టార్ సూర్య బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇద్దర్ స్టార్ హీరోల చిత్రాలు కూడా ఒకే సారి తేదీలు క్లాష్ అవుతాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలనే భారతీయుడు 2 చిత్రం ఏప్రిల్ 2024లో విడుదలవుతుందని పుకార్లు వచ్చాయి.

  • Written By:
  • Updated On - November 11, 2023 / 02:46 PM IST

Kanguva: తమిళ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న నెక్ట్స్ మూవీ కంగువా. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఏప్రిల్ 11, 2024న విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ చెన్నైలో ఇటీవల ప్రారంభమైన నేపథ్యంలో ఈ సమాచారం వచ్చింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సూర్య అభిమానులు సినిమా విడుదల తేదీని ప్రకటించమని మేకర్స్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

CHANDRA MOHAN: చంద్రమోహన్ ఆఖరి మాటలు ఇవే..

మరోవైపు ఈ మూవీ నుంచి జూలైలో విడుదలైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరో కమల్ హాసన్‌‌కి స్టార్ సూర్య బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇద్దర్ స్టార్ హీరోల చిత్రాలు కూడా ఒకే సారి తేదీలు క్లాష్ అవుతాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలనే భారతీయుడు 2 చిత్రం ఏప్రిల్ 2024లో విడుదలవుతుందని పుకార్లు వచ్చాయి. అయితే ఇండియన్ 2 రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుండగా.. మొదటి భాగాన్ని ఏప్రిల్ 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రెండవ భాగం ఇండియన్ 3 దీపావళికి విడుదల చేయాలని షెడ్యూల్ చేశారు. మరి ఈ మూవీ రిలీజ్ తేదీపై ఇండియన్ 2 టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే తేదీకి వస్తారా లేదా రిలీజ్‌ని ఒక వారం లేదా రెండు వారాలు వాయిదా వేస్తారా అనేది కొన్ని రోజుల తర్వాత తేలిపోనుంది.