పుష్ప వర్సెస్ రోలెక్స్, త్రివిక్రమ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై చాలా అంచనాలున్నాయి. పుష్ప సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం చాలా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - December 17, 2024 / 08:10 PM IST

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై చాలా అంచనాలున్నాయి. పుష్ప సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం చాలా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఇప్పటికే వర్కౌట్ కూడా మొదలుపెట్టాడు. ఇప్పటివరకు అసలు ఇండియన్ సినిమాలో చూపించని ఒక కథను ఓ కాన్సెప్ట్ ను ఈ సినిమాలో చూపించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ అయ్యాడు.

దాదాపు ఏడాది నుంచి ఈ కథ పైన త్రివిక్రమ్ కూర్చున్నట్లుగా తెలుస్తోంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా కోసం సూర్యదేవర నాగ వంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాడని టాక్. జనవరి నుంచి ఈ సినిమాను అధికారికంగా మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై కొన్ని ప్రకటనలు వచ్చిన అవన్నీ నిజం కాదని జనవరిలో సంక్రాంతి తర్వాత నుంచి ఈ సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 2026 సంక్రాంతికి సినిమాలో విడుదల చేయడం లేదా వచ్చే ఏడాది డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయడం బన్నీ చేస్తున్నాడట.

పుష్ప సినిమాతో దాదాపు మూడు ఏళ్లపాటు బన్నీ నుంచి ఒక సినిమా కూడా లేదు. దీనితో ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశలో ఉన్నారు. అందుకే కొంచెం స్పీడ్ గా సినిమాలు చేయాలని… ప్రభాస్ లాంటి హీరోలు ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని… నువ్వు కూడా అదే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనితో బన్నీ కూడా అందుకు రెడీ అయిపోతున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకుంటారనే దానిపై స్పష్టత లేకపోయినా టాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ సినిమాలో విలన్ రోల్ చేయనున్నాడు.

విక్రమ్ సినిమా ద్వారా తనలో నెగిటివ్ షేడ్ కూడా ఉందని సూర్య ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమాలో రోలెక్స్ పాత్ర సూపర్ హిట్ అయింది. దీనితో అదే పాత్ర పై సినిమా కూడా ప్లాన్ చేశాడు దర్శకుడు లోకేష్. ఇక సూర్యకు మన తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనితో నెగిటివ్ రోల్ కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ మాజీ హీరోయిన్ కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనుంది.