Takkar Review: ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ ఆ తరువాత అనుకోకుండా సినిమాలకు దూరమయ్యాడు. చాలా కాలం పాటు సినిమాలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో టక్కర్ అనే సినిమా తీశాడు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఎలాగైనా డబ్బు సంపాదించాలి.. రిచ్ అవ్వాలి అనుకునే మెంటాలిటీ. డబ్బే అన్నిటికి పరమావధి అనుకునే మనస్తత్వం. కానీ హీరోయిన్ ఇందుకు పూర్తిగా రివర్స్. జీవితంలో డబ్బు శాశ్వతం కాదు.. మనిషికి మనిషే తోడు అనుకునే క్యారెక్టర్. ఈ సినిమాలో అమ్మాయిల అక్రమ రవాణా మెయిన్ ప్లాట్. అనుకోకుండా ఈ ఉచ్చులో చిక్కుకుంటాడు హీరో. ఇది హీరోయిన్‌తో దూరాన్ని పెంచుతుంది. తాను చేస్తున్నది తప్పని తెలుసుకుని హీరో ఎలా మారాడు. హీరోయిన్‌ను ఎలా దక్కించుకున్నాడు. విలన్‌లకు ఎలా బుద్ధి చెప్పాడు అనేది మిగతా కథ.
ఓవరాల్‌గా ఈ కథ చాలా కామన్‌గా ఉందంటున్నారు ఆడియన్స్. దాదాపు అన్ని ప్రాంతాల్లో సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తరువాత సిద్ధార్థ్ కంబ్యాక్ ఇచ్చినా.. అతని స్క్రీన్ ప్రజెన్స్ ఆడియన్స్‌ను ఏమాత్రం మెప్పించలేకపోయింది. నివాస్ కే ప్రసన్న అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ కాలేకపోయింది. కొన్ని సాంగ్స్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాటోగ్రఫీ కాస్త ఫర్వాలేదు అనిపించినా.. కథ చాలా బోరింగ్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ కాస్త చూసేలా ఉన్నా.. సెకండ్ హాఫ్ మాత్రం కథకు సంబంధం లేనట్టుగా ఉంటుంది.
యోగిబాబు కామెడీ సినిమాకు కాస్త ప్లస్ అయ్యింది. సినిమాలో అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. సిద్ధార్థ్, దివ్యాంశతో రెచ్చిపోయి రోమాన్స్ చేశాడు. అటు యాక్షన్ సీన్స్ కూడా బాగానే పోగేశాడు డైరెక్టర్ కార్తీక్ జీ క్రిష్. సిద్ధార్థ్‌ను లవర్ బాయ్‌గా చూసిన ఆడియన్స్ యాక్షన్ సీన్స్‌లో చూసి కొత్తగా ఫీలయ్యారు. ఓవరాల్‌గా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.